IPL 2024 RCB vs PBKS : ఐపీఎల్ 17వ సీజన్లో విరాట్ కోహ్లీ(58) తొలి హాఫ్ సెంచరీ బాదాడు. పంజాబ్ కింగ్స్‌పై ఈ రన్ మెషీన్ 31బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఫిఫ్టీ సాధించాడు. దాంతో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 రన్స్ చేసింది. దాంతో, 176 పరుగుల ఛేదనలో జోరుమీదున్న ఆర్సీబీకి హర్‌ప్రీత్ బ్రార్ షాకిచ్చాడు. 18 పరుగులతో ఆడుతున్న రజత్ పాటిదార్‌ను బౌల్డ్ చేసి 43 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. మ్యాక్స్‌వెల్(1) క్రీజులోకి వచ్చాడు. ఆర్సీబీ విజయానికి 56 బంతుల్లో 90 పరుగులు కావాలి.
పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో బెంగళూరు ఓపెనర్లు కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(3) దూకుడుగా ఆడారు. అయితే.. రబాడ 26 పరుగుల వద్ద డూప్లెసిస్‌ను ఔట్ చేసి పంజాబ్‌కు బ్రేక్ ఇచ్చాడు. మరో ఎండ్‌లో కోహ్లీ మాత్రం బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో అతడు ఏకంగా మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో, ఆర్సీబీ స్కోర్ నాలుగు ఓవర్లకే 40 దాటింది. ఆ తర్వాతి ఓవర్లో రబాడ డేంజరస్ కామెరూన్ గ్రీన్(3)ను రబాడ ఔట్ చేశాడు.