హైదరాబాద్, ఆట ప్రతినిధి: కోహినూర్ కప్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్-2023లో పాల్గొంటున్న యువ జిమ్నాస్ట్‌లను సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అభినందించారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా తెలంగాణ జిమ్నాస్టిక్ అసోసియేషన్, కే స్పోర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బాలబాలికల విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో మనదేశంతో పాటు రష్యా, పోలాండ్, ఉక్రెయిన్‌కు చెందిన పలువురు జిమ్నాస్ట్‌లు పాల్గొంటున్నారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్ వేణుగోపాలచారి, ఉప్పల శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, ఆంజనేయగౌడ్, ప్రేమ్‌రాజ్, రవి నాయక్ తదితరులు హాజరయ్యారు.