KL Rahul: కేఎల్ రాహుల్ కుడి తొడకు సర్జరీ పూర్తి
KL Rahul: సక్సెస్‌ఫుల్‌గా కేఎల్ రాహుల్ సర్జరీ పూర్తి అయ్యింది. అతని కుడి తొడకు సర్జరీ జరిగింది. ఐపీఎల్లో ఆర్సీబీతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతను గాయపడిన విషయం తెలిసిందే. గాయం తీవ్రం కావడం వల్ల అతన్ని ఐపీఎల్ నుంచి దూరం పెట్టారు.
న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul) కుడి తొడకు విజయవంతంగా సర్జరీ ముగిసింది. మంగళవారం ఆ శస్త్ర చికిత్స చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అతను ఓ పోస్టు చేశాడు. చాలా స్మూత్‌గా, ఎటువంటి ఇబ్బందిలేకుండా సర్జరీ చేసిన డాక్టర్లకు అతను థ్యాంక్స్ తెలిపాడు. ఐపీఎల్లో లక్నోకు ఆడుతున్న రాహుల్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ సమయంలో గాయపడ్డాడు. అయితే గాయపడ్డ రాహుల్‌ను ఐపీఎల్ నుంచి దూరం పెట్టిన విషయం తెలిసిందే. ఇక జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు కూడా అతను దూరం అయ్యాడు. సర్జరీ పూర్తి చేసుకున్న రాహుల్ నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకోనున్నాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

