GT vs KKR : పంతొమ్మిదో సీజన్లో అదిరే ఆటతో టాప్‌లో కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్‌పై కన్నేసింది. వరసగా ఐదింటా గెలుపొంది 16 పాయింట్లు సాధించిన గుజరాత్ శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడిస్తే దర్జాగా నాకౌట్‌కు చేరే అవకాశముంది. కానీ, భారీ తేడాతో గెలిచి పోటీలోకి రావాలని కోల్‌కతా భావిస్తోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆలస్యంగా కోల్‌కతా స్క్వాడ్‌లో చేరిన మథీశ పథిరన తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.
Big venue. Bigger stakes. 🏟️
Setting the stage for a classic in the City of Joy 💙💜
Updates ▶️ https://t.co/m8jevRTt29#TATAIPL | #KhelBindaas | #KKRvGT | @KKRiders | @gujarat_titans pic.twitter.com/0T4bgGhVB4
— IndianPremierLeague (@IPL) May 16, 2026
గుజరాత్ తుది జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), సుందర్, హోల్డర్, నిశాంత్ సింధు, రషీద్ ఖాన్, సాయి కిశోర్, అర్షద్ ఖాన్, రబడ, సిరాజ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – ప్రసిధ్ కృష్ణ, రాహుల్ తెవాటియా, అనుజ్ రావత్, కుమార్ కుషాగ్ర, గ్లెన్ ఫిలిప్స్.
కోల్‌కతా తుది జట్టు : రహానే(కెప్టెన్), ఫిన్ అలెన్, రఘువంశీ(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, మనీశ్ పాండే, రింకూ సింగ్, నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే, కార్తిక్ త్యాగి.
ఇంప్యాక్ట్ సబ్స్ – రొవ్మన్ పావెల్, రమన్‌దీప్ సింగ్, తేజస్వీ దహియా, మథీశ పథిరన, వైభవ్ అరోరా.