ICC Champions Trophy | ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కివిస్..!
ICC Champions Trophy | వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లోనే మిచెల్ బ్రేస్ వెల్ ఎల్బీడబ్ల్యూ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 159 పరుగులకు న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.
ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఆదివారం దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో 250 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ నిలకడగా ఆడుతుండగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ ఎల్బీడబ్ల్యూ కావడంతో పెవిలియన్ దారి పట్టాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లోనే మిచెల్ బ్రేస్ వెల్ ఎల్బీడబ్ల్యూ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 159 పరుగులకు న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ముందు టీం ఇండియా 250 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఓపెనర్ రుచిన్ రవీంద్రను హార్దిక్ పాండ్యా నాలుగో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ బాట పట్టించాడు. హార్దిక్ పాండ్య వేసిన బంతికి అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి రుచిన్ రవీంద్ర పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోర్ 23/1. ఇక 12వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి వేసిన మూడో బంతిని ఆడబోయిన విల్ యంగ్ బౌల్డయ్యాడు.
అప్పటికి విల్ యంగ్ మూడు ఫోర్లతో 22 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ 69 పరుగులతో క్రీజ్‌లో కొనసాగుతున్నా డెరిల్ మిచెల్, టామ్ లాథమ్ ఔటయ్యారు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో టామ్ లాథమ్ 14 పరుగులకు ఎల్బీడబ్యూ కావడంతో పెవిలియన్ బాట పట్టాడు. డెరిల్ మిచెల్ 17 పరుగులకు కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కావడంతో వెనుదిరిగాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

