MI vs UPW : యూపీవారియర్స్ కీలక వికెట్ కోల్పోయింది. కిరణ్ నవగరే(12)ను నాట్ సీవర్ బ్రంట్ ఔట్ చేసింద. యస్తికా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ పట్టింది. తహ్లియా మెక్‌గ్రాత్ (7), గ్రేస్ హ్యారిస్(6) క్రీజులో ఉన్నారు. అంతకుముందు కెప్టెన్ ఎలీసా హేలీ (8) ఎల్బీగా ఔటయ్యింది. ఇసీ వాంగ్ ఓవర్లో అంపైర్ నాటౌట్ ఇవ్వడతో ముంబై రివ్యూ తీసకుంది. రివ్యూలో ఔట్‌గా తేలడంతో హేలీ నిరాశగా వెనుదిరిగింది. దాంతో 21పరుగలు వద్ద యూపీ రెండో వికెట్ కోల్పోయింది. తొలి బంతికే మెక్‌గ్రాత్ ఔటయ్యేది. కానీ, కీపర్ యస్తికా సులువైన క్యాచ్ వదిలేసింది. 7 ఓవర్లకు యూపీ మూడు వికెట్ల నష్టానికి 35 రన్స్ చేసింది.
నాట్ సీవర్ బ్రంట్ వేసిన మూడో ఓవర్లో హేలీ, కిరణ్ ఇచ్చిన క్యాచ్‌లను ముంబై ఫీల్డర్లు నేలపాలు చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్‌కు రెండో ఓవర్లో షాక్ తగిలింది. ఓపెనర్ దేవికా వైద్య (1) ఔటయ్యింది. హర్మన్‌ప్రీత్ కౌర్ స్లిప్ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో ఆమె వెనుదిరిగింది.