రోహిత్ శర్మకు త్వరలో ఆ అవకాశం వస్తుంది: కిరణ్ మోరే

భారత క్రికెట్ జట్టుకు త్వరలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించే అవకాశం ఉందని
టీమ్ఇండియా మాజీ చీఫ్ సెలక్టర్, వికెట్ కీపర్ కిరణ్ మోర్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ శర్మకు త్వరలో అవకాశం వస్తుందని నమ్ముతున్నాను. మహేంద్ర సింగ్ ధోనీ ఆధ్వర్యంలో ఆడిన తెలివైన కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఎంతకాలం వన్డేలు, టీ20లకు కెప్టెన్‌గా ఉండాలనుకుంటున్నాడో కూడా ఆలోచిస్తాడు. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఈ నిర్ణయాల గురించి మీకు మరింత సమాచారం తెలుస్తుందని’ మోరే పేర్కొన్నారు. ఏదో ఒకరోజు విరాట్ కోహ్లీనే స్వయంగా రోహిత్‌తో బాధ్యతలను పంచుకోవడానికి ముందుకొస్తాడని మోరే వ్యాఖ్యానించాడు.
ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు జో రూట్, వన్డే టీమ్‌కు ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌కు టిమ్ పైన్, వన్డే జట్టుకు అరోన్ ఫించ్ కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. ఫార్మాట్‌కు అనుగుణంగా స్పెషలిస్ట్ కెప్టెన్లు కలిగి ఉన్నారు. ఈ తరహాలోనే భారత జట్టుకు కూడా ఫార్మాట్‌ను బట్టి కెప్టెన్లు నియమిస్తే బాగుంటుందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- captaincy
- Kiran More
- ms dhoni
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

