Kiran Georgi | ఇక్సాన్: కొరియా మాస్టర్స్‌లో భారత యువ షట్లర్ కిరణ్ జార్జి జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా సాగుతున్న అతడు శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్స్‌లో 21-14, 21-16తో టకుమ ఒబయషి (జపాన్)ను చిత్తు చేశాడు. వరుస గేమ్‌లలో ప్రత్యర్థిని ఖంగుతినిపించిన కిరణ్.. 39 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. సెమీస్‌లో అతడు ప్రపంచ ఐదో ర్యాంక్ ఆటగాడు కున్లావత్ వితిద్సరన్ (థాయ్‌లాండ్)తో తలపడనున్నాడు.