MS Dhoni | కింగ్ ఈజ్ బ్యాక్.. ధోనీపై కోహ్లి ప్రశంసల వర్షం
క్రికెట్లోని అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడిగా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోనీ( MS Dhoni ).. చాలా రోజుల తర్వాత మెరుపులు మెరిపించాడు.

దుబాయ్: క్రికెట్లోని అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడిగా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోనీ( MS Dhoni ).. చాలా రోజుల తర్వాత మెరుపులు మెరిపించాడు. ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో చివర్లో వచ్చి చెలరేగిన ధోనీ.. చెన్నైని చివరి ఓవర్లో గెలిపించాడు. చేసింది 18 పరుగులే అయినా.. ఆ సమయంలో ఉండే ఒత్తిడిని తట్టుకుంటూ ఒకప్పటి ధోనీని తలపించాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్ తర్వాత మిస్టర్ కూల్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశాడు. కింగ్ ఈజ్ బ్యాక్.. గేమ్‌లో గ్రేటెస్ట్ ఫినిషర్. మరోసారి నన్ను ఆనందంతో గెంతులేసేలా చేశాడు అని ధోనీని ట్యాగ్ చేస్తూ విరాట్ ట్వీట్ చేశాడు.
అటు పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా కూడా ధోనీని పొగుడుతూ ఓ ట్వీట్ చేసింది. ఫినిషర్ ధోనీ మరోసారి ముందుండి టీమ్‌ను నడిపించాడు. తన ప్లేయర్స్‌కు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ, ఎప్పుడూ తన సహనాన్ని కోల్పోకుండా ఉన్నాడని ప్రీతి ఆ ట్వీట్లో ప్రశంసించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప కళ్లు చెదిరే ఇన్నింగ్స్, ధోనీ ఫినిషింగ్‌తో క్వాలిఫయర్‌లో గెలిచి 9వ సారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

