Kavya Maran | ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరిన హైదరాబాద్ జట్టు.. కావ్య మారన్ సెలబ్రేషన్స్ చూశారా..?
Kavya Maran | ఐపీఎల్-17వ సీజన్లో (IPL 2024) ప్రముఖంగా వినిపించిన పేరు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) జట్టు ఓనర్ కావ్య మారన్ (Kavya Maran).
Kavya Maran | ఐపీఎల్-17వ సీజన్లో (IPL 2024) ప్రముఖంగా వినిపించిన పేరు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) జట్టు ఓనర్ కావ్య మారన్ (Kavya Maran). ఆటలో ఆరెంజ్ ఆర్మీ ఓటమి, గెలుపు సందర్భంగా ఆమె ఎక్స్ప్రెసెన్సే ఇందుకు కారణం. అయితే, తాజాగా మరోసారి కావ్య హెడ్‌లైన్స్‌లో నిలిచారు. హైదరాబాద్ జట్టు ఫైనల్స్‌కు (SRH Enter IPL Final) చేరడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ఆకట్టుకుంటోంది.
ఐపీఎల్-17లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన విజయాలతో ప్లేఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. కీలకమైన ‘క్వాలిఫయర్-2’లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఆరేళ్ల తర్వాత ఆరెంజ్ ఆర్మీ ఫైనల్స్‌కు చేరింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నెట్టింట పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాని మొత్తం ఆరెంజ్ ఆర్మీతో నింపేశారు.
ఇక మ్యాచ్‌ను స్టాండ్స్‌లో కూర్చొని వీక్షించిన జట్టు ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ ఆనందంతో గంతులేశారు. తన జట్టు ఆటతీరు చూసి సంతోషంలో మునిగి తేలిపోయారు. అక్కడున్న సభ్యులతో కరచాలనం చేస్తూ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక మ్యాచ్ విజయం సాధించాక ఆమె ఎగ్జైట్ అవుతూ పలికించిన హావభావాలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎస్ఆర్హెచ్ ఆదివారం అమీతుమీకి సిద్ధమైంది.
Celebrations in the @SunRisers camp 🔥👏#TATAIPLPlayoffs #IPLonJioCinema #SRHvRR #TATAIPL pic.twitter.com/GAJpI7nngY
— JioCinema (@JioCinema) May 24, 2024
The winning celebration from Kavya Maran. 🥳🥳
Cummins & Kavya Maran after dominating RR! 😂😂🔥🔥#SRHvsRR #RRvsSRH #KavyaMaran #PatCummins #SRHvsKKR #KKRvsSRH #IPLFinal pic.twitter.com/tlsPtjiHYJ— 𝑺𝒖𝒎𝒊𝒕 𝑺𝒊𝒏𝒈𝒉 𝑹𝒂𝒋𝒑𝒖𝒕 (@BeingSumit007) May 24, 2024
Also Read..
Kerala | కేరళలో భారీ వర్షాలు.. 11 మంది మృతి.. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Arvind Kejriwal | భార్య, పిల్లలతో కలిసి ఓటేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Jaishankar | కేంద్ర మంత్రి జైశంకర్‌కు అరుదైన అవకాశం.. ఎన్నికల సంఘం నుంచి సర్టిఫికెట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

