IPL 2024 RCB vs CSK | వింటేజ్ కార్తీక్, అనుజ్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్..!
IPL 2024 RCB vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) బ్యాటర్లు చెలరేగారు. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ ఆటగాళ్లు అనుజ్ రావత్(48: 25 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లు), దినేశ్ కార్తిక్...
IPL 2024 RCB vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) బ్యాటర్లు చెలరేగారు. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ ఆటగాళ్లు అనుజ్ రావత్(48: 25 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లు), దినేశ్ కార్తీక్(38 నాటౌట్: 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించారు. ఇద్దరూ తమ విధ్వంసక ఇన్నింగ్స్‌తో బెంగళూరును ఆదుకున్నారు. దాంతో, ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 రన్స్ బాదింది. సీఎస్కే బౌలర్లలో ముస్తాఫిజుర్ 4 వికెట్లు, దీపక్ చాహర్ ఒక వికెట్ పడగొట్టారు.
చెపాక్‌లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆర్సీబీకి శుభారంభం దక్కింది. తుషార్ దేశ్‌పాండే, మథీశ బౌలింగ్‌లో డూప్లెసిస్ బౌండరీలతో విరుచుకుపడడంతో మరో ఎండ్‌లోని కోహ్లీ ప్రేక్షక పాత్ర వహించాడు. ఫాఫ్ బాదుడుతో, 5 ఓవర్లకే ఆర్సీబీ 41 రన్స్ కొట్టింది. ఆ దశలో బంతిని అందుకున్న ముస్తాఫిజుర్ సీఎస్కేకు బ్రేక్ ఇస్తూ ఒకే ఓవరలో రెండు వికెట్లు తీశాడు. భారీ షాట్ ఆడిన డూప్లెసిస్డూప్లెసిస్(35), బౌండరీ వద్ద రచిన్ రవీంద్రకు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(0)ను ధోనీ వెనక్కి పంపాడు. అక్కడితో ఆర్సీబీ వికెట్ల పతనం మొదలైంది.
.@RCBTweets Dial 6⃣! 🔥
Anuj Rawat & Dinesh Karthik upping the ante! ⚡️ ⚡️
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE
Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL | #CSKvRCB | @AnujRawat_1755 | @DineshKarthik pic.twitter.com/c5o3rXdEZf
— IndianPremierLeague (@IPL) March 22, 2024
కోహ్లీ, గ్రీన్ వికెట్లతో..
తొలి ఓవర్లోనే ముస్తాఫిజుర్ రెండు వికెట్లు తీయగా.. డేంజరస్ మ్యాక్స్‌వెల్(0)ను దీపక్ చాహర్ వెనక్కి పంపాడు. దాంతో, 42 పరుగులకే మూడు వికెట్లు.. అయినా కోహ్లీ(21), కామెరూన్ గ్రీన్(18)లు క్రీజులో ఉన్నారనే ధైర్యంతో ఆర్సీబీ ఉంది. కానీ, ముస్తాఫిజుర్ మరుసటి ఓవర్లో ఈ ఇద్దరినీ ఔట్ చేసి ఆర్సీబీని కోలుకోలేని దెబ్బ తీశాడు. 78 పరుగులకే ఐదు వికెట్లు పడిన బెంగళూరును దినేశ్ కార్తీక్(38 నాటౌట్), అనుజ్ రావత్(48)లు ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 95 రన్స్ జోడించి ఆర్సీబీకి పోరాడగలిగే స్కోర్ అందించారు.
Brilliant relay catch 👌
Timber strike 🎯Mustafizur Rahman is making merry & so are @ChennaiIPL 🙌
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE
Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL | @ajinkyarahane88 pic.twitter.com/0GKADcZleM
— IndianPremierLeague (@IPL) March 22, 2024
ఇవి కూడా చదవండి
- Janhvi Kapoor | సూపర్ టైమింగ్.. కరెక్ట్ టైంలో అటాక్ మొదలు పెట్టిన జాన్వీ కపూర్..!
- Aravind Kegriwal | ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఆరు రోజుల కస్టడీ
- Virat Kohli | పొట్టి క్రికెట్లో విరాటపర్వం.. టీమిండియా నుంచి ఒకేఒక్కడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

