Karnataka: పెళ్లికి నిరాకరించిన అమ్మాయిని హత్య చేసి.. సూసైడ్ చేసుకున్నాడు
Karnataka: పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డాడు. ఆమె నిరాకరించింది. దీంతో విషం ఇచ్చే ప్రయత్నం చేశాడు. దాన్ని తిప్పికొట్టిందామె. ఆ కోపంలో ఉన్మాది తన వద్ద ఉన్న కత్తి తీసి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత గొంతు కోసుకుని అతనూ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన కర్నాటకలో జరిగింది.
బెంగుళూరు: కర్నాటక(Karnataka)లో దారుణం జరిగింది. ఓ అమ్మాయి తనతో పెళ్లికి అంగీకరించలేదని, ఆ ఉన్మాది ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెల్గావిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నాథ్ పాయి సర్కిల్ వద్ద 20 ఏళ్ల ఐశ్వర్య మహేహ్ లోహర్ అనే అమ్మాయిని.. 29 ఏళ్ల ప్రశాంత్ కుందేకర్ హత్య చేశాడు. బెల్గావి తాలుకలోని యెల్లూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఐశ్వర్యను ఏడాది కాలం నుంచి ప్రశాంత్ ప్రేమిస్తున్నాడు. పెయింటర్గా పనిచేస్తున్న ఆ వ్యక్తి.. గతంలో ఓ సారి ఐశ్వర్య తల్లిని పెళ్లి గురించి ప్రస్తావించాడు. ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. కానీ ఆర్థికంగా స్థిరపడాలని బాధితురాలి తల్లి నిందితుడికి హితబోధ చేసింది. ఐశ్వర్య పిన్ని ఇంటికి విషం బాటిల్తో వెళ్లిన ప్రశాంత్.. పెళ్లి చేసుకోవాలని ఆమెను వత్తిడి చేశారు. ప్రశాంత్ అభ్యర్థనను ఆమె తిరస్కరించింది. విషం తాగేలా ఐశ్వర్యను వత్తిడి చేశాడు. కానీ ఆమె అడ్డుకున్నది. ఆ సమయంలో తన జేబులో ఉన్న కత్తిని తీసి.. ఐశ్వర్య గొంతు కోశాడు ప్రశాంత్.
విపరీతంగా రక్త స్త్రావం కావడంతో ఐశ్వర్య మృతిచెందినట్లు తేల్చారు. ఆ తర్వాత అదే కత్తితో.. తన గొంతు కోసుకున్న ప్రశాంత్.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి, సిటీ పోలీసు కమీషనర్ యాద మార్టిన్ తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

