వన్డే ప్రపంచకప్‌నకు విలియమ్సన్ దూరం
ఈ యేడాది చివరలో ఇండియాలో జరుగనున్న ప్రపంచకప్‌నకు కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహి స్తూ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన విలియమ్సన్ కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయనున్నారు.
వెల్లింగ్టన్ : ఈ యేడాది చివరలో ఇండియాలో జరుగనున్న ప్రపంచకప్‌నకు కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహి స్తూ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన విలియమ్సన్ కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయనున్నారు. దీనితో అతడు అక్టోబర్-నవంబర్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశం లేదు. విలియమ్సన్ కుడి మోకాలి ఆంటీరియర్ క్రూసియేట్ లిగామెంట్(ఏసీఎల్) తీవ్రంగా దెబ్బతిన్నదని, శస్త్రచికిత్స అనంతరం కొన్ని నెలలపాటు అతడు ఆటకు దూ రంగా ఉండాలని క్రికెట్ న్యూజిలాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో వన్డే ప్రపంచకప్‌నకు విలియమ్సన్ అందుబాటులో ఉండడు. గాయ పడడం బాధాకరంగా ఉందని, అయినా తనకు మద్దతుగా నిలిచిన ఫ్రాంచైజీ, క్రికెట్ న్యూజిలాండ్‌కు రుణపడి ఉంటానని విలియమ్సన్ అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

