ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లిన విలియమ్సన్

దుబాయ్: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరోసారి టాప్‌లోకి దూసుకెళ్లాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తన టీమ్‌కు అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టిన కేన్.. ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్‌గా నిలిచాడు. ఫైనల్ రెండు ఇన్నింగ్స్‌లో 49, 52 పరుగులు చేసిన విలియమ్సన్.. 900 పాయింట్లు దాటాడు. 901 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు.
ఇక ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో గతవారం టాప్‌లో ఉన్న రవీంద్ర జడేజా.. తాజా ర్యాంకుల్లో రెండో స్థానానికి పడిపోయాడు. విండీస్ ప్లేయర్ జేసన్ హోల్డర్ మళ్లీ టాప్‌లోకి వెళ్లాడు. ఇక ఇండియాతో ఫైనల్లో అద్భుతంగా రాణించిన కైల్ జేమీసన్ కెరీర్ బెస్ట్ 13వ ర్యాంక్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు 7 వికెట్లు తీశాడు. అటు బౌల్ట్ 2 స్థానాలు మెరుగుపరచుకొని 11వ స్థానానికి వెళ్లాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో విలియమ్సన్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన రాస్ టేలర్ 14వ స్థానానికి ఎగబాకాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

