ENG Vs AUS Ashes Test | యాషెస్ రెండో టెస్ట్‌లో గందరగోళం..! పిచ్ వైపు దూసుకొచ్చిన నిరసనకారులు
ENG Vs AUS Ashes Test | యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం బుధవారం ప్రారంభమైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ ప్రారంభమైన తొలి ఓవర్లో మైదానంలో ఒక్కసారిగా గందరగోళం చేసుకున్నది.
ENG Vs AUS Ashes Test | యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం బుధవారం ప్రారంభమైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ ప్రారంభమైన తొలి ఓవర్లో మైదానంలో ఒక్కసారిగా గందరగోళం చేసుకున్నది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్ గ్రూప్’నకు చెందిన ఇద్దరు నిరసనకారులు పిచ్‌వైపు దూసుకువచ్చారు. దాంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. గ్రూప్‌కు చెందిన నిరసనకారులు మైదానంలో ఆరెంజ్ పౌడర్‌ను చల్లేందుకు ప్రయత్నించగా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు అడ్డుకున్నారు.
ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఓ నిరసనకారుడి పట్టుకొని.. అతన్ని 50 మీట్లరు దూరం మోసుకువెళ్లి, బౌండరీ హోర్డింగ్‌లను దాటుకుంటూ వెళ్లి సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాడు. మరో ఇద్దరు నిరసనకారులను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొద్దిగా ఆరెంజ్ పౌడర్ మైదానంలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఘటన అనంతరం బెయిర్‌స్టో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి.. జెర్సీపై పడిన ఆరెంజ్ పౌడర్‌ను శుభ్రం చేసుకున్నాడు. అలాగే మైదానంలో పడిన ఆరెంజ్ పౌడర్‌ను గ్రౌండ్ స్టాఫ్ తొలగించారు. కొద్దిసేపటి తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెయిర్‌స్టోను పలువురు అభిమానులు అభినందించారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్‌లా మారడని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. నిరసనకారుడిని బెయిర్‌స్టో ఎత్తుకువెళ్తున్న వీడియోపై భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం స్పందించాడు. ‘రెండో టెస్టుకు మంచి ఆరంభం. బెయిర్‌స్టో ఇప్పటికే హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేశాడు’ అని ఛమత్కరిస్తూ రెండు నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. ఇదిలా ఉండగా.. జస్ట్ స్టాప్ ఆయిల్ నిరసనకారులు ఈ ఏడాది బ్రిటన్‌లో చాలా క్రీడలకు అంతరాయం కలిగించారు. ఈ నెలలో లండన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు సమయంలో.. ఇంగ్లండ్ జట్టు బస్సును అడ్డుకున్నారు.
ప్రీమియర్ సాకర్ మ్యాచ్‌లు, ట్వికెన్‌హామ్‌లో ప్రీమియర్‌షిప్ రగ్బీ ఫైనల్, షెఫీల్డ్‌లో ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో నిరసన తెలిపారు. అయితే, నిరసనకారుల చర్యలు గ్రౌండ్లో పని చేసే వారితో పాటు పలువురికి ప్రమాదం కలిగించడమే కాకుండా.. ఆటను చూసేందుకు డబ్బులు పెట్టి వస్తున్న ప్రేక్షకుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ సీఈవో గై లావెండర్ విమర్శించారు. అయితే, నిరసనకారులు కొత్త ఇంధన లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని నిరసనకారులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Bairstow picking up a pitch invader#Ashes pic.twitter.com/vCWCkXb3IA
— England’s Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

