RR vs KKR : పంతొమ్మిదో సీజన్లో తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతాను టాపార్డర్ బ్యాటర్లు మళ్లీ ముంచేశారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ టిమ్ సీఫర్ట్(0)ను ఆర్చర్ బౌల్డ్ చేయగా.. బర్గర్ ఓవర్లో ఫామ్‌లో లేని అజింక్యా రహానే(0) ఔటయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్టే అనిపించిన కామెరూన్ గ్రీన్(27)ను ధ్రువ్ జురెల్ అద్భుతంగా స్టంపౌట్ చేయడంతో కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది.
సొంత గడ్డపై ఏ జట్టైనా చెలరేగిపోతుంది. కానీ, కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం చతికిలపడుతోంది. వరుణ్ చక్రవర్తి(3-14), కార్తిక్ త్యాగీ(3-22)ల ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ను 155కే కట్టడి చేసిన కోల్‌కతా బ్యాటింగ్‌లో తడబాటును కొనసాగించింది. ఆర్చర్ సంధించిన మొదటి బంతికే సీఫర్ట్(0) బౌల్డయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో అజింక్యా రహానే(0)ను బర్గర్ వెనక్కి పంపాడు. ఓపెనర్లు డకౌటైన వేళ ఇంప్యాక్ట్ సబ్ రఘువంశీ(10 నాటౌట్) జతగా కామెరూన్ గ్రీన్(27) ధనాధన్ ఆడాడు.
THAT’s SOME STUMPING! 🤯
🎥 Dhruv Jurel off balance & diving away from the stumps but hits the target 🎯
Updates ▶️ https://t.co/776nTdPbPj#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/lqjSajx2iO
— IndianPremierLeague (@IPL) April 19, 2026
బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరికిస్తున్న గ్రీన్‌ను బిష్ణోయ్ బోల్తా కొట్టించాడు. వైడ్ బాల్ ఆడబోయిన గ్రీన్‌ను.. జురెల్ రెప్పపాటులో స్టంపింగ్ చేశాడు. కుడివైపు డైవ్ చేస్తూ బంతిని అందుకున్న జురెల్ బంతిని గురి చూసి వికెట్ల మీదకు విసిరాడు. అంతే.. ఇదేంటి? ఇలా జరిగింది? అని గ్రీన్ నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. యశ్ రాజ్ పూనియా ఓవర్లో పావెల్(12 నాటౌట్) 4, 6 బాదడంతో పవర్ ప్లేలో కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 51 రన్స్ కొట్టింది.