MI vs RR | రాణించిన జురెల్, ఆర్చర్.. రాజస్థాన్‌కు ప్లే ఆఫ్స్ బెర్తు దక్కేనా..!
దంచికొట్టే ఓపెనర్లు స్వల్ప స్కోర్‌కే ఔటైన వేళ ధ్రువ్ జురెల్(38), ఆర్చర్(32)లు ఆపద్భాదంవులయ్యారు. ఇంప్యాక్ట్ సబ్ జడేజా(19 నాటౌట్) మెరుపులతో రాజస్థాన్ రెండొందలు కొట్టింది.
MI vs RR : ప్లే ఆఫ్స్ బెర్తును నిర్ణయించే మ్యాచ్‌లో రాజస్థాన్ టాపార్డర్ బ్యాటర్లు తేలిపోయారు. పవర్ ప్లేలోనే ముంబై ఇండియన్స్ బౌలర్లు మూడువికెట్లతో దెబ్బతీయగా.. మిడిలార్డర్ సైతం తడబడింది. దంచికొట్టే ఓపెనర్లు స్వల్ప స్కోర్‌కే ఔటైన వేళ ధ్రువ్ జురెల్(38), ఆర్చర్(32)లు ఆపద్భాదంవులయ్యారు. కానీ, డెత్ ఓవర్లలో శార్దూల్(2-41) విజృంభించినా ఇంప్యాక్ట్ సబ్ జడేజా(19 నాటౌట్) మెరుపులతో రాజస్థాన్ రెండొందలు కొట్టింది.
వాంఖడేలో ముంబై బౌలర్ల జోరుకు రాజస్థాన్ టాపార్డర్ తేలిపోయింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(27), వైభవ్ సూర్యవంశీ(4)లు.. విఫలమయ్యారు. బాధ్యతగా ఆడాల్సిన కెప్టెన్ రియాన్ పరాగ్(14)ను గజన్ఫర్ బోల్తా కొట్టించాడు. ధాటిగా ఆడుతున్న శనక(29) రనౌటవ్వగా.. ధ్రువ్ జురెల్(38)ను యార్కర్‌తో బాస్చ్ ఔల్డ్ చేయడంతో ఐదో వికెట్ పడింది. రన్‌రేటు మెరుగ్గా ఉన్నప్పటికీ దంచేవాళ్లు కరువైన వేళ ఫెరీరా(18) నిలబడతానుకుంటే చాహర్ ఓవర్లో రెండో సిక్సర్ కొట్టబోయి బాస్చ్ చేతికి చిక్కాడు.
The ARCHER is shooting straight for the stands! 🏹
Updates ▶️ https://t.co/h2ze7K0gd6#TATAIPL | #KhelBindaas | #MIvRR pic.twitter.com/0cmtxbnCzE
— IndianPremierLeague (@IPL) May 24, 2026
ఆర్చర్ సిక్సర్లతో
ఫెరీరా ఔటయ్యాక గేర్ మార్చిన ఆర్చర్(32) సిక్సర్లతో అలరించాడు. బాస్చ్, శార్ధూల్ ఓవర్లో బంతిని స్టాండ్స్‌లోకి పంపి స్కోర్ 170 దాటించాడు. శుభం దూబే(5)తో కలిసి ఏడో వికెట్‌కు విలువైన రన్స్ జోడించాడు. శార్దూల్ బౌలింగ్‌లో ఆర్చర్, దూబే ఔటయ్యాక.. ఇంప్యాక్ట్ సబ్ రవీంద్ర జడేజా(19 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. దాంతో, రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగలిగింది.
Innings Break!
A collective batting effort by #RR 👏
Will #MI chase it? 🤔
Scorecard ▶️ https://t.co/h2ze7K0gd6#TATAIPL | #KhelBindaas | #MIvRR pic.twitter.com/vwRpCZbUmR
— IndianPremierLeague (@IPL) May 24, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

