భారత జుడోకా తులిక మాన్ మహిళల 78 కిలోల పైబడిన విభాగంలో రజతంతో మెరిసింది. బుధవారం జరిగిన ఫైనల్లో తులిక స్కాట్లండ్కు చెందిన సారా అడ్లింగ్టన్ చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది. నాలుగుసార్లు జాతీయ చాంపియన్ అయిన 22 ఏళ్ల తులిక ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చినా టాప్‌సీడ్ సారా అనుభవం ముందు సరితూగలేకపోయింది. పోరులో తులిక రెండుసార్లు రెఫరీ వార్నింగ్‌కు గురై ఒత్తిడికి లోనై ఓటమిపాలైంది. జూడోలో భారత్‌కిది మూడో పతకం.