WI vs AUS: కరోనా వచ్చినా మ్యాచ్ ఆడుతున్న గ్రీన్.. ఆటాడుకుంటున్న సహచర క్రికెటర్లు
WI vs AUS: ఆసీస్ బౌలర్లు వికెట్లు తీసి సహచర క్రికెటర్లు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా గ్రీన్‌ను మాత్రం పక్కనబెడుతున్నారు. నువ్వు మా దగ్గరికి రాకురా బాబు. ఆ కరోనాను మాకు అంటించకు..! అంటూ..
WI vs AUS: స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండో టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు.. కరోనా వచ్చినా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌తో పాటు స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, హెడ్‌కోచ్ మెక్డొనాల్డ్లు ఈ టెస్టుకు అందుబాటులో ఉన్నారు. గ్రీన్, హెడ్ ఫీల్డ్‌లో ఉండగా మెక్‌డొనాల్డ్ డగౌట్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఆసీస్ బౌలర్లు వికెట్లు తీసి సహచర క్రికెటర్లు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా గ్రీన్‌ను మాత్రం పక్కనబెడుతున్నారు. నువ్వు మా దగ్గరికి రాకురా బాబు. ఆ కరోనాను మాకు అంటించకు..! అంటూ ఆటపట్టిస్తున్నారు. ఆసీస్ బౌలర్ జోష్ హెజిల్వుడ్ అయితే ఏకంగా గ్రీన్‌ను ‘నువ్వు పక్కకుపో..’ అంటూ సంజ్ఞలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నది.
కోవిడ్-19కు గురైనా గ్రీన్ రెండో టెస్టు ఆడుతున్నాడు. అవసరమైన నిబంధనలను పాటిస్తూ అతడు మ్యాచ్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతినిచ్చింది. మ్యాచ్ ఆరంభ సమయంలో జాతీయ గీతం ఆలపించేప్పుడు గ్రీన్.. మిగిలిన క్రికెటర్లకు కొంత గ్యాప్ ఇచ్చి పాల్గొన్నాడు. ఇక హెజిల్వుడ్ విండీస్ సారథి క్రెయిగ్ బ్రాత్‌వైట్ (4)ను ఔట్ చేయగానే ఆసీస్ ప్లేయర్లంతా సెలబ్రేట్ చేసుకోవడానికి ముందుకొచ్చారు. వారితో పాటు గ్రీన్ హెజిల్‌వుడ్‌కు చేరువగా వచ్చాడు. అప్పుడు హెజిల్వుడ్.. ‘నువ్వు దగ్గరకు రాకు.. దూరం పో’ అంటూ సంజ్ఞ చేశాడు. అప్పుడు గ్రీన్ కూడా ‘ఓకే.. ఓకే.. వెళ్తున్నా’ అంటూ అక్కడ్నుంచి దూరం జరిగాడు.
Sorry Cam… not today 😂😂
Josh Hazlewood wasn’t letting COVID-Positive Cam Green near the celebrations 😷
📺 WATCH #AUSvWI on Ch. 501 or stream via @kayosports https://t.co/BtKGJLIGHn
📝 BLOG https://t.co/P6sokOPqSe
📲 MATCH CENTRE https://t.co/P2cWnKBjl1 pic.twitter.com/VZQqLoK81Q— Fox Cricket (@FoxCricket) January 25, 2024
బ్రిస్బేన్ (గబ్బా) వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్.. మూడో సెషన్ ఆటలో 72 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. కావెమ్ హాడ్జ్ (61 బ్యాటింగ్), జోషువా డి సిల్వ (64 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

