తడబడి.. నిలబడి..

- అన్సీడెడ్పై చెమటోడ్చి నెగ్గిన జొకోవిచ్ క్వార్టర్స్‌లో నాదల్, జ్వెరెవ్, గాఫ్
- సోఫియా కెనిన్‌కు షాక్
- ఫ్రెంచ్ ఓపెన్
తొలుత తడబాటు.. ఆనక తిరుగులేని ఆధిపత్యం.. ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ ఆడిన తీరిది. అనామక ప్లేయర్ చేతిలో తొలి రెండు సెట్లు కోల్పోయిన జొకో ఆ తర్వాత గర్జించాడు. ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి చివరి మూడు సెట్లలో అదరగొట్టి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మట్టికోర్టు రారాజు నాదల్ తన శైలిలో ముందడుగేయగా.. జ్వెరెవ్, స్వార్జ్‌మన్ కూడా క్వార్టర్స్ చేరారు. మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ కెనిన్‌కు షాక్ ఎదురుకాగా.. 17 ఏండ్ల అమెరికా అమ్మాయి కోకో గాఫ్ తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వార్టర్స్‌కు చేరింది.
పారిస్: ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మట్టికోర్టు పోరు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఊహించని రీతిలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. అన్‌సీడెడ్ లొరెంజో ముసేటి (ఇటలీ) చేతిలో టైబ్రేకర్ల ద్వారా తొలి రెండు సెట్లు కోల్పోయి ఉత్కంఠ రేపిఇనా ఆ తర్వాత జొకో దండయాత్ర చేశాడు. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్ 6-7 (7/9), 6-7 (2/7), 6-1, 6-0, 4-0తో ఆధిక్యంలో ఉండగా.. చివరి సెట్లో ముసేటి గాయం కారణంగా తప్పుకున్నాడు. మూడున్నర గంటలు సాగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు టైబ్రేకర్ వరకు వెళ్లగా.. నొవాక్ వెనుకబడ్డాడు. అయితే ఆ తర్వాత మూడు సెట్లలో కేవలం 14 పాయింట్లే కోల్పోయి ప్రత్యర్థిని చిత్తుచేశాడు. జొకో మొత్తం 11 ఏస్‌లు, 53 విన్నర్లు సంధించగా.. ముసెటి ఒకే ఒక్కఏస్, 30 విన్నర్లు సాధించగలిగాడు. చివరి సెట్లో జొకో గెలుపు ముంగిట ఉండగా లొరెండో వైదొలిగాడు. క్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ బెరెటినీతో నొవాక్ తలపడనున్నాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్ బుల్ నాదల్ 7-5, 6-3, 6-0తో సిన్నర్(ఇటలీ)పై అలవోకగా గెలిచాడు. ఆరోసీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-4, 6-1, 6-1 తేడాతో కీ నిషికొరి (జపాన్)పై అలవోకగా గెలువగా.. పదో సీడ్ డిగో స్వార్జ్‌మన్ 7-6 (11/9), 6-4, 7-5తో లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)ను చిత్తు చేసి క్వార్టర్స్ చేరాడు.
కెనిన్ నిష్క్రమణ
మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. సకారి (గ్రీకు) చేతిలో 1-6, 3-6 తేడాతో కెనిన్ పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో అమెరికా 17 ఏండ్ల యువ సంచలనం కోకో గాఫ్ 6-3, 6-1 తేడాతో ఓన్స్ జుబుయెర్ (టునీషియా)ను వరుస సెట్లలో చిత్తుచేసి.. 15ఏండ్లలో గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్ చేరిన పిన్నవయస్కురాలిగా నిలిచింది. క్రెజ్సికోవా 6-2, 6-0 తేడాతో స్టీఫెన్స్ పై గెలిచింది.
బోపన్న ఔట్
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి భారత వెటరన్ రోహన్ బోపన్న నిష్క్రమించాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో బోపన్న – ఫ్రాంకో స్కుగోర్ ద్వయం 5-7, 3-6 తేడాతో స్పెయిన్ జోడీ మార్టినెజ్ – అండుజర్ చేతిలో ఓటమిపాలైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- French Open
- jokovich
- nadal
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

