తాష్కెంట్: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్ జెరెమీ లాల్‌రినుగా స్వర్ణ పతకంతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల 67కిలోల విభాగంలో బరిలోకి దిగిన జెరెమీ మొత్తం 305కి(141కి+164కి) ఎత్తి పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. ఫైనల్‌కు అర్హత సాధించే క్రమంలో ఈ మణిపూర్ యువ లిఫ్టర్ స్నాచ్‌లో తన రికార్డును మరింత మెరుగుపర్చుకోగా, క్లీన్ అండ్ జెర్క్‌లో అత్యుత్తమ ప్రదర్శన(168కి)ను అందుకోలేకపోయాడు. కామన్వెల్ చాంపియన్‌షిప్‌తో సమాంతరంగా జరుగుతున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నీలో జెరెమీ పతకాన్ని దక్కించుకోలేకపోయాడు.