DC vs MI : ముంబై ఇండియన్స్(Mumbai Indians) మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్(5) ఔటయ్యింది. శిఖా పాండే ఓవర్లో జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues) మిడాన్‌లో డైవింగ్ క్యాచ్ పట్టడంతో ఆమె వెనుదిరిగింది. దాంతో, 10 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (5), అమేలియా కేర్ (7) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్లోమరిజానే కాప్ రెండు వికెట్లు తీసింది. మొదటి బంతికి ఓపెనర్ యస్తికా భాటియా(1)ను ఔట్ చేసింది. ఆ తర్వాతి బంతికి నాట్ సీవర్ బ్రంట్(0)ను బౌల్డ్ చేసింది. హ్యాట్రిక్ బాల్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ అడ్డుకుంది. 6 ఓవర్లకు ముంబై మూడు వికెట్ల నష్టానికి 19 రన్స్ చేసింది.
Screamer alert 🔥🔥
WHAT. A. CATCH from @JemiRodrigues 🙌🏻
Follow the match ▶️ https://t.co/Gcv5Cq5nOi#TATAWPL | #MIvDC pic.twitter.com/p4vlhHaYMI
— Women’s Premier League (WPL) (@wplt20) March 20, 2023