ముంబై: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాకు వారసుడొచ్చాడు. బుమ్రా భార్య సంజన గణేశన్ సోమవారం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన సందర్భాన్ని బుమ్రా..సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘మా చిన్న కుటుంబం మరింత వృద్ధి చెందుతున్నది.
మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. ఈ రోజు మా కుటుంబంలోకి చిన్న బాబు అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ఆహ్వానిస్తున్నాం. బాబు రాకతో మా జీవితంలో కొత్త వెలుగులు విరజిమ్మాయి’ అని అంటూ బుమ్రా తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొస్తూ ముగ్గురి చేతులు కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు.