ముంబై: ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తీవ్ర వత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సీజన్లో ముంబై జట్టు వరుస ఓటములు ఎదుర్కుంటోంది. ఇప్పటి వరకు బుమ్రా ఈ సీజన్లో ఒక్క వికెట్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు. అయితే ఆ ఫ్రష్ట్రేషన్ బుమ్రాలో కనిపించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తీవ్ర వత్తిడిలో ఉన్నట్లు తెలిసిపోయింది. ఓ దశలో బౌలింగ్ మార్కర్‌ను బుమ్రా విసిరేశాడు. ఆవేశాన్ని తట్టుకోలేక బౌలింగ్ మార్కర్‌ను విసిరేసినట్లు ఆ వీడియో ద్వారా అర్థమవుతోంది. ఈ ఘటనకు చెందిన ఓ ప్రైవేటు వీడియో రిలీజైంది. బౌలింగ్ మార్కర్‌ను విసిరేసి చాలా ఆగ్రహంగా అరిచినట్లు కూడా ఆ వీడియోలో ఉన్నది. అలాగే గ్రౌండ్‌లోనే ఉన్న మరో మార్కర్‌ను కూడా తన కాళ్లతో గట్టిగా తన్నాడు.
బుమ్రా తీవ్ర అసహనంతో ఉన్న సమయంలో.. క్రీజ్‌లో టిమ్ డేవిడ్ బ్యాటింగ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 240 రన్స్ చేయగా, ముంబై కేవలం 222 రన్స్ మాత్రమే చేసి ఓటమిపాలైంది. అయితే ఆ మ్యాచ్‌లో బుమ్రా తన 4 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చాడు. కానీ వికెట్ తీయలేకపోయాడు. బుమ్రా తాను ఆడిన 5 మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం వల్ల ఫ్రష్ట్రేషన్కు గురై ఉంటాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. బౌలింగ్ మార్కర్‌ను విసిరేసిన బుమ్రాపై ఐపీఎల్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
The toxic Mumbai management and Hardik Pandya have completely broken my GOAT from inside It’s so painful to watch him like this. 💔
He is Surely missing his captain Rohit !! pic.twitter.com/ccloXXSahc
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) April 17, 2026