మలగ (ఇటలీ): జానిక్ సిన్నర్ టాప్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్పై వరుసగా రెండు విజయాలు సాధించి ఇటలీని డేవిస్‌కప్ ఫైనల్స్‌కు చేర్చాడు. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఇటలీ 2-1తో సెర్బియాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో మియోమిర్ కెమనోవిచ్ 6-7(7), 6-2, 6-1తో లొరెంజొ ముసెట్టిపై గెలిచి సెర్బియాకు ఆధిక్యం అందించాడు. రెండో సింగిల్స్‌లో నాలుగో ర్యాంకర్ సిన్నర్ 6-2, 2-6, 7-5తో ఓడించి జట్టు స్కోరు సమం చేశాడు. అనంతరం లొరెంజొ సొనెగొతో కలిసి సిన్నర్ డబుల్స్‌లో జొకోవిచ్-సెమనోవిచ్ జోడిని 6-3, 6-4తో ఓడించి ఇటలీని ఫైనల్స్‌కు చేర్చారు. 1998 తరువాత ఇటలీ డేవిస్‌కప్ ఫైనల్స్‌కు చేరడం మరలా ఇదే. ఇటలీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.