ట్యురిన్ : ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో సంచలన విజయం నమోదు చేశాడు. సిన్నర్ టాప్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్‌ను మూడు సెట్ల పోరులో 7-5, 6-7(5), 7-6(2)తో ఓడించాడు. నాలుగుసార్లు ముఖాముఖి పోరులో 22 ఏళ్ల సిన్నర్‌కు జొకోపై ఇదే తొలి విజయం. మూడు గంటలకుపైగా సాగిన పోరులో మూడు సెట్లు టైబ్రేక్వరకు కొనసాగడం గమనార్హం. సిన్నర్ తదుపరి రౌండ్లో హోల్గర్ రూనెతో తలపడతాడు. కాగా 2019 చాంపియన్ త్సిసిపాస్ వెన్ను నొప్పి కారణంగా టోర్నీనుంచి తప్పుకున్నాడు.