IPL 2023 : సొంత గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు హడలెత్తిస్తున్నారు. చెన్నై పేస్, స్పిన్ దెబ్బకు ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. 70 పరుగుల లోపే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది. నేహల్ వధేరా(32), ట్సిస్టన్ స్టబ్స్(5) క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లకు స్కోర్.. 79/4. గాయం నుంచి కోలుకున్న దీపక్ చాహర్ చెలరేగాడు. డేంజరస్ ఇషాన్ కిషన్(7), రోహిత్ శర్మ(0)ను ఔట్ చేశాడు. క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్ యాదవ్(26)ను జడేజా బౌల్డ్ చేశాడు.