Kapil Dev | రిచర్డ్స్, సచిన్, పాంటింగ్‌ను చూశా.. కానీ కొందరే సూర్యలా ఆడగలరు : కపిల్ దేవ్
సూర్యలాంటి ఆటగాడు శతాబ్దానికి ఒక్కడే ఉంటాడు - కపిల్ దేవ్
Kapil Dev : టీమిండియా టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్‌ను మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఆకాశానికి ఎత్తేశాడు. అతని బ్యాటింగ్‌ను వర్ణించడానికి మాటలు రావడం లేదని అన్నాడు. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ… సూర్య కొట్టిన షాట్లను వర్ణించడానికి కొన్నిసార్లు నాకు మాటలు దొరకడం లేదు. ‘వివ్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ వంటి గొప్ప ఆటగాళ్లను చూశాను. కానీ, వీళ్లలో కొందరే సూర్యకుమార్ యాదవ్‌లాగా బంతిని పర్ఫెక్ట్గా బాదగలరు. సూర్యలాంటి ఆటగాడు శతాబ్దానికి ఒక్కడే ఉంటాడు’ అని కపిల్ అన్నాడు. మూడో టీ20లో మెరుపు శతకం సాధించిన సూర్య ఆటతీరు బౌలర్లను భయపెడుతుందని ఈ లెజెండరీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
‘సూర్య అద్భుతమైన ఆటగాడు. అతను ఫైన్ లెగ్‌లో భారీ షాట్లు ఆడుతుంటే ఎక్కడ బంతి వేయాలో తెలియక బౌలర్లు అయోమయంలో పడతారు. ఎందుకంటే.. సూర్య మిడ్ ఆన్, మిడ్ వికెట్ వద్ద నిల్చొని కూడా సిక్సర్ కొట్టగలడు అని టీమిండియా లెజెండ్ వెల్లడించాడు. కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించింది.
రాజ్‌కోట్‌లో శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ లంక బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. 45 బంతుల్లోనే శతకం సాధించాడు. నలువైపులా బౌండరీలు, సిక్స్‌లు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. దాంతో, సిరీస్ డిసైడర్ అయిని ఈ మ్యాచ్‌లో భారత్ 228 స్కోర్ చేసింది. భారీ టార్గెట్ ఛేదనలో ఆది నుంచి శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు. భారత బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 137 పరుగులకు ఆలౌట్ అయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

