Graeme Smith | సూర్యకుమార్ బ్యాటింగ్ స్టయిల్ అచ్చం డివిలియర్స్ లాగానే ఉంటుంది : గ్రేమ్ స్మిత్
గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా రాణించాడు
Graeme Smith : టీ 20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ సిరీస్‌లో అదరగొట్టిన భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌ను మాజీ క్రికెటర్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అతనిపై ప్రశంసలు కురిపించాడు. సూర్యకుమార్ బ్యాటింగ్ స్టయిల్ అచ్చం డివిలియర్స్ లాగానే ఉంటుంది అని అన్నాడు. ‘ఐపీఎల్లో సూర్య బ్యాంటింగ్ చూశాను కామెంటరీ చేస్తూ, అతని బ్యాటింగ్ చూస్తున్నందుకు నేను అదృష్టవంతుడిని. అతను ఏడాది ఏడాదికి మెరుగవుతున్నాడు. అతనిలో టాలెంట్ చాలా ఉంది. సరైన సమయంలో సరైన షాట్లు కొట్టగల సామర్థ్యం అతని సొంతం. సూర్యకుమార్ లాంటి ఆటగాడు ఆడుతుంటే జనం టీవీలకు అతుక్కుపోతారు’ అని స్మిత్ తెలిపాడు.
ఒక ఏడాదిలో టీ 20ల్లో 1,000 పరుగులు చేసిన మొదటి టీమిండియా బ్యాటర్‌గా సూర్యకుమార్ రికార్డు సాధించాడు. అంతేకాదు టీ20ల్లో నంబర్ వన్ స్థానంకు ఎగబాకాడు. న్యూజిలాండ్ సిరీస్‌లోనూ సూర్య తన విశ్వరూపం చూపించాడు. మొదటి టీ 20లో సెంచరీ చేసి సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా రాణించాడు. 2003లో షాన్ పొలాక్ నుంచి కెప్టెన్సీ అందుకున్నాడు. 2014లో క్రికెట్ వీడ్కోలు పలికిన స్మిత్ కామెంటేటర్‌గా అవతారం ఎత్తాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

