Ishant Sharma | తండ్రైన భారత సీనియర్ పేసర్.. వెల్లువెత్తుతున్న అభినందనలు
Ishant Sharma : భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma) తండ్రి అయ్యాడు. అతడి భార్య ప్రతిమా సింగ్(Pratima Singh) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఇషాంత్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో...
Ishant Sharma : భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma) తండ్రి అయ్యాడు. అతడి భార్య ప్రతిమా సింగ్(Pratima Singh) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఇషాంత్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఒక కొత్త ఆడపిల్ల. ఒక అద్భుతాలతో కూడిన ప్రపంచం. ఆశ, ఎన్నో అందమైన కలల్ని వెంటేసుకొని వచ్చింది’ అని లంబూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
దాంతో.. మాజీ క్రికెటర్లు, బాలీవుడ్ తారలు ఇషాంత్ దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మొదటిసారి తల్లిదండ్రులైన లంబూ జంటకు విరాట్ కోహ్లీ(Virat Kohli) భార్య అనుష్కా శర్మ(Anushka Sharma) హృదయపూర్వక అభినందనలు తెలిపింది.
భారత గొప్ప బౌలర్లలో ఒకడైన ఇషాంత్.. బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్రతిమను 2016లో వివాహం చేసుకున్నాడు. ఇషాంత్.. టీమిండియా తరఫున 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 434 వికెట్లు పడగొట్టాడు. ఈ వెటరన్ పేసర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లోనూ తనముద్ర వేశాడు.
ఇషాంత్ శర్మ

గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్టకు ప్రాతినిధ్యం వహించిన లంబూ.. ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరఫున అదరగొట్టాడు. అంతేకాదు.. ఈమధ్యే వెస్టిండిస్ పర్యటనలో ఇషాంత్ కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
-
Mark Zuckerberg | జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్రచికిత్స.. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటో షేర్ చేసిన మెటా సీఈవో
-
Congress Leaders Expelled | పార్టీ అభ్యర్థులపై పోటీ.. 39 మంది కాంగ్రెస్ నేతల బహిష్కరణ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

