CSK vs SRH : ప్లే ఆఫ్స్‌లో రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ముందడుగు వేసింది. కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)పై విజయంతో ఐదుసార్లు ఛాంపియన్ ఆశలపై కమిన్స్ సేన నీళ్లు చల్లింది. సీఎస్కే నిర్దేశించిన 181 ఛేదనలో ఇషాన్ కిషన్(70), క్లాసెన్(47) అర్ధశతక భాగస్వామ్యంతో గెలుపు వైపు నడిపారు. క్లాసెన్ ఔటైనా.. ఇషాన్ 4, 6 తో తేలిక చేయగా సలీల్ అరోరా(10 నాటౌట్), స్మరన్(5 నాటౌట్) ముగించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు గుజరాత్ టైటాన్స్ సైతం నాకౌట్‌కు అర్హత సాధించింది.
పంతొమ్మిదో సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్తుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ మరింత చేరువైంది. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను తక్కువకే కట్టడి చేసిన ఆరెంజ్ ఆర్మీ.. లక్ష్యాన్ని ఉఫ్‌మనిపించింది. ఓపెనర్లు విఫలమైనా.. మాజీ కెప్టెన్ ఇషాన్ కిషన్(70), క్లాసెన్(47) ఖతర్నాక్ ఆటతో చెన్నై నాకౌట్ ఆశలను ఆవిరి చేశారు. సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్ కావడంతో విజయంకోసం సీఎస్కే గట్టిగానే పోరాడింది.
The Orange Army marches into the Playoffs 🧡
8️⃣th Top 4 appearance for #SRH 👊🔥#TATAIPL | #KhelBindaas | #CSKvSRH pic.twitter.com/YaQmhqLYz8
— IndianPremierLeague (@IPL) May 18, 2026
ప్రత్యర్థిని180కే కట్టడి చేసిన సన్‌రైజర్స్ ఆరంభంలోనే ట్రావిస్ హెడ్(6) వికెట్ కోల్పోయింది. ఇంప్యాక్ట్ సబ్‌గా వచ్చిన హెడ్ ముకేశ్ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం అభిషేక్ శర్మ(26), ఇషాన్ కిషన్(70)లు రిస్క్ తీసుకోకుండా పవర్ ప్లేలో వికెట్ పడకుండా పరుగులు సాధించారు. కానీ, అకీల్ హొసేన్ పక్కా ప్లాన్‌తో అభిషేక్‌ను బోల్తా కొట్టించాడు. హోసేన్, నూర్ అహ్మద్ స్పిన్ దయాన్ని సమర్ధంగా ఎదుర్కొన్న హెన్రిచ్ క్లాసెన్(47) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను స్పెన్సర్ వదిలేశాడు. 18 పరుగుల వద్ద బతికిపోయిన ఈ చిచ్చరపిడుదు వెంటనే 6, 4 తో రన్‌రేటును తగ్గించాడు. ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన ఈ జంట అర్ధ శతక భాగస్వామ్యంతో చెన్నై ని భయపెట్టింది.
Stabilizer as well as the aggressor 🔥
🎥 Ishan Kishan at the top of his game at Chepauk 🧡
Updates ▶️ https://t.co/4SxAzYKEvY#TATAIPL | #KhelBindaas | #CSKvSRH | @SunRisers pic.twitter.com/6pLQcQgkDb
— IndianPremierLeague (@IPL) May 18, 2026
నూర్ ఓవర్లో క్లాసెన్‌ను శాంసన్ రెప్పపాటులో స్టంపౌట్ చేసి ఆశలు రేపాడు. అప్పటికి సన్‌రైజర్స్ విజయానికి 33 బంతుల్లో 50 రన్స్ కావాలి. నితీశ్ రెడ్డి(11) ఔటైనా ఇషాన్ తగ్గలేదు. ముకుల్ ఓవర్లో అతడి స్ట్రెయిట్ బౌండరీ, లెగ్ సైడ్ సిక్సర్‌తో సమీకరణం 12 బంతుల్లో 13గా మారింది. ఇషాన్ వెనుదిరిగినా.. సలీల్ అరోరా(10 నాటౌట్), స్మరన్(5 నాటౌట్) లాంఛనం ముగించగా.. సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దాంతో, సొంత మైదానంలో విజయంతో ప్లే ఆఫ్స్ పోటీలో నిలవాలనుకున్న చెన్నై నిరాశలో కూరుకుపోయింది.
చావోరేవో పోరులో దంచేయాలనుకున్న సీఎస్కేను కమిన్స్(3-28) దెబ్బతీశాడు. నిప్పులు చెరుగుతూ సీఎస్కే టాపార్డర్‌ను ప్యాటీ కూల్చగా.. మిడిలార్డర్‌ను షకీబ్ హుస్సేన్(2-34), ఇషాన్ ఇబ్బంది పెట్టాడు. మిడిల్ ఓవర్లలో డెవాల్డ్ బ్రెవిస్(44), కార్తిక్ శర్మ(32)లు రాణించగా.. శివం దూబే(26) మెరుపులతో చెన్నై 181 పరుగులు చేసింది.