SRH vs RCB : క్వాలిఫయర్ 1 పై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ విధ్వంసంతో కొండంత స్కోర్ కొట్టింది. ఉప్పల్ స్టేడియంలో అభిషేక్ శర్మ(56) మెరుపు ఆరంభాన్వివ్వగా.. ఇషాన్ కిషన్(79), క్లాసెన్(51) జోడీ తర్ధ శతకాలతో ఆర్సీబీ బౌలర్ల భరతం పట్టింది. వీరిద్దరూ శతక భాగస్వామ్యం నెలకొల్పగా.. డెత్ ఓవర్లలో నితీశ్ రెడ్డి(29 నాటౌట్) సిక్సర్లతో రెచ్చిపోగా హైదరాబాద్ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాట్ బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ కమిన్స్ నమ్మకాన్ని నిలబెడుతూ రెండొందల స్కోరందించారు. పవర్ ప్లేలోనే ట్రావిస్ హెడ్(26) ఔటైనా అభిషేక్ శర్మ(56) జోరు తగ్గించలేదు. ఇషాన్ కిషన్(79)తో కీలక భాగస్వామ్యంతో స్కోర్ వంద దాటించాడు. షెపర్డ్ ఓవర్లో సిక్స్, ఫోర్లతో రెచ్చిపోయిన అభిషేక్ 22 బంతుల్లో అర్ద శతకం సాధించాడు. సిక్సర్ కొట్టబోయి అతడు ఔటైనా.. తర్వాత క్లాసెన్(51) మరో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.
Turns up again in tough times 👊
Krunal Pandya dismisses Heinrich Klaasen to break the partnership 👏
Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @RCBTweets pic.twitter.com/UPN7SBOC6U
— IndianPremierLeague (@IPL) May 22, 2026
చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్, క్లాసెన్ జంట ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించింది. ముఖ్యంగా ఇషాన్ మూడో వికెట్‌కు ఈ జోడీ బౌండరీలతో ఆర్సీబీ బౌలర్లను బెంబేలెత్తించింది. డెత్ ఓవర్లలో.. రసిక్ దార్ ఓవర్లో బౌండరీతో హైదరాబాద్ స్కోర్ రెండొందల మార్క్ చేరింది. మూడో వికెట్‌కు 113 పరుగులు రాబట్టిన ఈ ద్వయాన్ని విడదీసి కృనాల్ పాండ్యా ఊరటనిచ్చాడు. క్రీజులోకి వస్తూనే నితీశ్ రెడ్డి() రెండుసార్లు బంతిని బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఇషాన్ ఔటవ్వగా 4 వికెట్ల నష్టానికి హైదరాబాద్ 255 పరుగులు చేసింది. ఆర్సీబీని 165కే ఆలౌట్ చేస్తే కమిన్స్ సేన క్వాలిఫయర్ 1కు అర్హత సాధించనుంది.