INDvsSA: టెస్టు సిరీస్‌కు ముందే భారత్‌కు మరో షాక్.. స్టార్ వికెట్ కీపర్ ఔట్
INDvsSA: ఇదివరకే టెస్టు జట్టు నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా వికెట్ కీపర్ బ్యాటర్...
INDvsSA: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టుకు టెస్టు సిరీస్‌కు ముందే వరుస షాకులు తాకుతున్నాయి. ఇదివరకే టెస్టు జట్టు నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా టెస్టు జట్టు నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఆంధ్రా కుర్రాడు కోన శ్రీకర్ భరత్‌ను జట్టులో చేర్చుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇషాన్ కిషన్ టెస్టు జట్టు నుంచి రిలీజ్ కావడానికి వ్యక్తిగత కారణాలు అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. సిరీస్ నుంచి విడుదల చేయాలని అతడే స్వయంగా కోరినట్టు బీసీసీఐ తెలిపింది. టెస్టు సిరీస్ ఆరంభానికి (డిసెంబర్ 26) ఇంకా పది రోజుల సమయం ఉండటంతో మళ్లీ ఏమైనా షాకులుంటాయేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇషాన్ రిలీజ్ తర్వాత భారత టెస్టు జట్టు ఇలా ఉంది. కెఎస్ భరత్ ప్రస్తుతం ఇండియా – ఏ టీమ్‌తో దక్షిణాఫ్రికాలోనే ఉన్న విషయం విదితమే.
🚨 UPDATE 🚨: Ishan Kishan withdrawn from #TeamIndia’s Test squad. KS Bharat named as replacement. #SAvIND
Details 🔽https://t.co/KqldTEeD0T
— BCCI (@BCCI) December 17, 2023
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ, కెఎస్ భరత్ (వికెట్ కీపర్)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

