కోల్‌కతా: న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధి అద్భుతమైన రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన షాట్‌ను.. తన స్వంత బౌలింగ్‌లోనే అనూహ్య రీతిలో క్యాచ్ పట్టేశాడు. కోల్‌కతాలో జరిగిన మూడవ టీ20లో.. సోధి వేసిన 12వ ఓవర్లో.. రోహిత్ ముందుకు వచ్చి భారీ షాట్‌కు ప్రయత్నించాడు. స్ట్రెయిట్‌గా ఆ షాట్ కొట్టాడు. బౌలింగ్ వేసి ముందుకు వెళ్తున్న సోధి.. తనవైపు దూసుకువస్తున్న ఆ బంతిని .. అంతే వేగంగా ఒక చేతితో అందుకున్నాడు. కళ్లు చెదిరే రీతిలో తన ఫీల్డింగ్‌తో సోధి ఆకట్టుకున్నాడు. రోహిత్ ఆ మ్యాచ్‌లో 56 రన్స్ చేశాడు. 73 పరుగుల తేడాతో మూడవ టీ20 నెగ్గిన టీమిండియా.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. సోధి అందుకున్న ఆ క్యాచ్‌ను ఈ వీడియోలో చూడండి.