ICC World Cup Trophy | విజేతకు ఇచ్చే వరల్డ్‌కప్ ట్రోఫీ అసలైందేనా..?
ICC World Cup Trophy | ప్రతి నాలుగేండ్లకోసారి జరిగే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ విజేతలకు ఇచ్చే ట్రోఫీని విజేతకు అందజేసి, తర్వాత దాన్ని దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో భద్రపరుస్తారు. దీని నమూనా ట్రోఫీని విజేతకు అందిస్తారు.
ICC World Cup Trophy | నాలుగేండ్లకోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ విజేతకు ట్రోఫీ బహుకరించే విషయం తెలిసిందే. దాదాపు 11 కిలోల బరువుతో, 60 సెంటీ మీటర్ల ఎత్తుతో ఉండే ఈ ట్రోఫీని బంగారం, వెండితో తయారు చేస్తారు. అయితే మరి ప్రతిసారి ప్రపంచకప్ విజేత కోసం ఈ హుంగూ ఆర్భాటాలతో ట్రోఫీని తయారు చేస్తారా..? అనే అనుమానం ప్రతి ఒక్కరికీ వచ్చే ఉంటుంది. దీనికి సమాధానం ముమ్మాటికీ కాదు!
ప్రస్తుతం ప్రపంచ విజేతకు అందిస్తున్న ట్రోఫీని 1999లో రూపొందించారు. ఇక అప్పటి నుంచి 2003, 07, 11, 15, 19 విజేతలకు ఈ ట్రోఫీని బహుకరించారు. బహుమతి ప్రదాన సమయంలో మాత్రమే ఒరిజినల్ ట్రోఫీని విజేత చేతికి అందిస్తారు. ఆ తర్వాత దాన్ని తిరిగి దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో భద్రపరుస్తారు. దీని నమూనా ట్రోఫీని విజేతకు అందిస్తారు. వికెట్ల రూపంలో ఉన్న మూడు పిల్లర్ల మధ్య బంతిని పోలి ఉండే విశ్వం నమూనాతో ఉన్న ట్రోఫీనిక గత ఆరుసార్లుగా అందిస్తూ వస్తున్నారు.
1975లో తొలిసారి వన్డే ప్రపంచకప్ నిర్వహించగా.. తొలి మూడు ఎడిషన్లలో ప్రూడెన్షియల్ కప్ ట్రోఫీ అని పిలిచేవారు. ఆ తర్వాత భారత్ భారత్‌లో జరిగిన 1987 ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వగా.. రియలన్స్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. దీంతో ప్రూడెన్షియల్ కప్ కాస్తా.. రిలయన్స్ ట్రోఫీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 1992లో ‘బెన్సన్, హెడ్జెస్ ట్రోఫీ, 1996లో ‘విల్స్ కప్ ట్రోఫీ’గా దీన్ని పిలిచారు. 1999 నుంచి ఇక స్పాన్సర్ల పేర్ల మీద కాకుండా కేవలం ప్రపంచకప్ అని అభివర్ణిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

