Irfan Pathan : టీ20 వరల్డ్ కప్‌లో విషాదం నెలకొంది. భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్పాన్ పఠాన్ (Irfan Pathan) మేకప్ ఆర్టిస్ట్ ప్రమాదవశాత్తూ మరణించాడు. మెగా టోర్నీ కోసం పఠాన్‌తో సహా వెస్టిండీస్‌కు వెళ్లిన ఫయాజ్ అన్సారీ (Faiyz Ansari) అనకోకుండా స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోయి ఊపిరాడక చనిపోయాడు. స్నానం చేసేందుకు ఈత కొలనులో దిగిన అతడు అందులో మునిగిపోయాడు.
జూన్ 12 శుక్రవారం ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. ఊహించని పరిణామంతో ఇర్ఫాన్ షాక్‌లో ఉండిపోయాడు. ఫయాజ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్. అతడికి రెండు నెలల క్రితమే పెండ్లి అయింది. ఈత కొలనులో మునిగి ఫయాజ్ మరణించాడనే వార్త తెలియగానే భారత్‌లోని అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్వగ్రామం నుంచి ముంబైకి మాకం మార్చిన ఫయాజ్ అక్కడ సొంతంగా సెలూన్ ప్రారంభించాడు. అతడి సెలూన్‌కు ఇర్ఫాన్ పఠాన్ మేకప్ కోసం, హెయిర్ స్టయిలింగ్ కోసం తరచూ వెళ్తుండేవాడు. ఇర్ఫాన్‌కు ఫయాజ్ వర్క్ చాలా నచ్చింది. దాంతో, అతడిని తన వ్యక్తిగత మేకప్ ఆర్టిస్టిగ్ నియమించుకున్నాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్న ఇర్ఫాన్ అప్పటి నుంచి ఫయాజ్ను తన వెంట తీసుకెళ్లేవాడు.

ఐపీఎల్ 17వ సీజన్లో.. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో కోసం ఈ మాజీ ఆల్‌రౌండర్ తన స్టయిలిస్ట్‌తో సహా అమెరికా, వెస్టిండీస్‌లకు వెళ్లాడు. అయితే.. స్నానం చేసేందుకు ఈత కొలనులోకి దిగిన ఫయాజ్ అందులో మునిగిపోయి ప్రాణాలు విడిచాడు. దాంతో, ఫయాజ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమయ్యే మొత్తం ఖర్చును ఇర్పాన్ భరిస్తున్నాడు. మరో రెండు మూడు రోజుల్లో ఫయాజ్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.