Irfan Pathan | అతడిని మిడిల్ ఓవర్లలో ఆడిస్తే.. ఆర్సీబీకి తిరుగుండదు
Irfan Pathan : ఐపీఎల్ 17వ సీజన్‌కు నెల రోజులే ఉండడంతో అన్ని ఫ్రాంచైజీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. కొన్ని జట్లు కొత్త కోచ్‌లు, కొత్త కెప్టెన్ల నియామకంతో జోష్ మీదున్నాయి. 17వ సీజన్‌కు ముందు ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) కీలక వ్యాఖ్యలు..
Irfan Pathan : ఐపీఎల్ 17వ సీజన్‌కు నెల రోజులే ఉండడంతో అన్ని ఫ్రాంచైజీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. కొన్ని జట్లు కొత్త కోచ్‌లు, కొత్త కెప్టెన్ల నియామకంతో జోష్ మీదున్నాయి. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు పేపర్‌పై అన్ని పటిష్టంగానే కనిపిస్తున్నా.. మైదానంలో మాత్రం తేలిపోతోంది. నిరుడు బ్యాటింగ్ యూనిట్ భారమంతా కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ మాత్రమే మోశారు. దాంతో, 17వ సీజన్‌కు ముందు ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు.
కుర్రాడు అనుజ్ రావత్(Anuj Rawat)ను మిడిల్ ఓవర్లలో ఆడించాలని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. ‘ఒకవేళ అనుజ్ మిడిల్ ఓవర్లలో ఆడితే ఆర్సీబీ సూపర్ టీమ్ అవుతుంది. ఈ కుర్రాడు నిరుడు అద్భుతంగా ఆడాడు. ఈ విషయంపై బెంగళూరు దృష్టి పెట్టాలి’ అని ఇర్ఫాన్ సూచించాడు.
అనుజ్ రావత్

16వ సీజన్లో అనుజ్ 9 మ్యాచుల్లో 128 స్ట్రైక్ రేటుతో 91 రన్స్‌తో పర్వాలేదనిపించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అనుజ్ ముంబై ఇండియన్స్‌పై హాఫ్ సెంచరీ కూడా కొట్టాడు. దాంతో, ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో రోహిత్ సేనను ఓడించింది.

ఐపీఎల్ టోర్నీలో ఫేవరెట్ జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఆ జట్టు రెండు సార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. దాంతో, ఈ సీజన్‌కు ముందు మేనేజ్మెంట్ అనుభవజ్ఞుడైన ఆండీ ఫ్లవర్(Andy Flower)ను ఆర్సీబీ కోచ్‌గా నియమించింది. ఫ్లవర్ నేతృత్వలో తొలి ట్రోఫీ కొట్టాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. నిరుడు సీజన్ ఆసాంతం విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రమే రాణించారు. దాంతో, ఆ జట్టు ప్లే ఆఫ్స్ ముందు మరోసారి బోల్తాపడింది.
ఇవి కూడా చదవండి
- Security Increase | ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు భద్రత పెంపు
- Balagam Venu | నా ‘బలగం’ సినిమా అందరూ చూశారు మా నాన్న తప్ప.. వేణు ఎమోషనల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

