హోబర్ట్: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన ఫస్ట్ రౌండ్ గ్రూప్ బి మ్యాచ్‌లో ఇవాళ ఐర్లాండ్ జట్టు స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసింది. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. ఐర్లాండ్ బ్యాటర్లు క్యాంపర్, డాక్రెల్లు కీలక ఇన్నింగ్స్ ఆడి స్కాట్లాండ్కు చుక్కలు చూపించారు. ఆ ఇద్దరూ అయిదో వికెట్‌కు అజేయంగా 9.3 ఓవర్లలో 119 రన్స్ జోడించారు.
Some magnificent scenes after Ireland's memorable win against Scotland 📸 #SCOvIRE | #T20WorldCup pic.twitter.com/fUKUJJkXhD
— ICC (@ICC) October 19, 2022
తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 176 రన్స్ చేసింది. అయితే భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్ 9.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 61 రన్స్ మాత్రమే చేసింది. ఇక ఆ దశలో క్యాంపర్, డాక్రెల్లు క్రీజ్‌లో నిలదొక్కుకుని భారీ ఇన్నింగ్స్ ఆడారు. ఆ ఇద్దరూ బౌండరీలతో హోరెత్తించారు. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న ఐర్లాండ్‌కు అనూహ్య రీతిలో విజయం దక్కింది.
కర్టిస్ క్యాంపర్ 32 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 72 రన్స్ చేశాడు. ఇక జార్జ్ డాక్రెల్ 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 రన్స్ చేశాడు.
స్కోరుబోర్డు
స్కాట్లాండ్ 176/5
ఐర్లాండ్ 180/4