FIFA World Cup | వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన ఇరాన్.. వేల్స్‌పై 2-0తో గెలుపు
ఈ మ్యాచ్‌లో ఇరాన్ ఆటగాళ్లు 6 సార్లు గోల్ కొట్టేందుకు ప్రయత్నించారు
FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్ జట్టు బోణీ కొట్టింది. అల్ రయాన్ అహ్మద్బిన్ అలీ స్టేడియంలో శుక్రవారం వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-2 గోల్స్‌తో ఇరాన్ జట్టు ఘన విజయం సాధించింది. ఇరాన్ ప్లేయర్ రౌజిహ్ చెస్మి 98వ నిమిషంలో మొదటి గోల్ కొట్టాడు. 101వ నిమిషంలో రమిన్ రెజీయాన్ జట్టుకు రెండో గోల్ అందించాడు. దాంతో ఇరాన్ 2-0 గోల్స్‌తో వేల్స్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో ఇరాన్ ఆటగాళ్లు 6 సార్లు గోల్ కొట్టేందుకు ప్రయత్నించారు. వేల్స్ టీమ్ నాలుగుసార్లు గోల్ కోసం ప్రయత్నించి విఫలమైంది. ఈ మ్యాచ్‌లో వేల్స్ గోల్ కీపర్ వేనే హెన్నెసే రెడ్ కార్డ్ అందుకున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో రెడ్ కార్డ్ అందుకున్న మొదటి వ్యక్తి అతనే. ఇరాన్ జట్టు తమ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఇంగ్లండ్ జట్టు 6-2 గోల్స్‌తో ఇరాన్‌పై గెలుపొందింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

