IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. తొలి దశ మ్యాచ్‌లకు పది జట్లు సిద్ధమైన వేళ రెండో దశ షెడ్యూల్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడం, కెప్టెన్లతో సమావేశం పూర్తవ్వడంతో బీసీసీఐ(BCCI) రెండో దశ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 13 నుంచి రెండో విడత లీగ్ జరగనుండగా మే 24న జరిగే ఫైనల్‌తో విజేత ఎవరో తేలిపోనుంది. అయితే.. ప్లే ఆఫ్స్ తేదీలను మాత్రం వెల్లడించలేదు.
ఐపీఎల్ సందడికి మరో రెండో రోజులే ఉండడంతో బీసీసీఐ గురువారం కీలక ప్రకటన చేసింది. తొలి విడత ఐపీఎల్‌కు కొనసాగింపుగా రెండో దశ షెడ్యూల్‌ను వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పాటు పది ఫ్రాంచైజీల కెప్టెన్లతో సమావేశం పూర్తి కావడంతో షెడ్యూల్‌పై కసరత్తు చేసిన బీసీసీఐ గురువారం మ్యాచ్‌ల జాబితా విడుదల చేసింది. ఏప్రిల్ 13 నుంచి రెండో దశ మ్యాచ్‌లు నిర్వహిస్తామని, మే 24న ఫైనల్ ఉంటుందని భారత బోర్డు తెలిపింది.
🚨 News 🚨
BCCI announces schedule for second phase of #TATAIPL 2026 🗓️
The remainder of the league stage, comprising 50 matches, will be played from April 13 to May 24, 2026, across 12 venues in India 🏟️
More details 🔽https://t.co/iYGnB0Gd2J
— IndianPremierLeague (@IPL) March 26, 2026
రెండో దశలో 12 వేదికల్లో 50 మ్యాచ్‌లు జరుపుతామని బీసీసీఐ పేర్కొంది. వీటిలో ఎనిమిది డబుల్ హెడర్స్ ఉంటాయని, మధ్యాహ్నం 3:30 గంటలకు ఒకటి, రాత్రి 7:30 గంటలకు రెండో గేమ్ ఆడిస్తామని ఫ్రాంచైజీలకు భారత బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశాడు. అయితే.. ప్లే ఆఫ్స్ తేదీలను మాత్రం చెప్పలేదు.
రెండో దశలో తొలి మ్యాచ్ ఏప్రిల్ 13న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగనుంది. పంజాబ్ కింగ్స్ జట్టు తమ హోమ్ మ్యాచ్‌లను న్యూ చంఢీగఢ్‌లో ఆడనుంది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ధర్మశాలలో ఉంటాయి. రాజస్థాన్ సొంత గడ్డ అయిన జైపూర్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ చిన్నస్వామిలో మూడు, రాయ్‌పూర్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.
రెండో దశ వేదికలు : హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్.టాటా ఐపీఎల్ 19వ సీజన్ పూర్తి షెడ్యూల్ కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.