పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!
ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య భారీ ట్రేడింగ్ డీల్ ఖరారైనట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య భారీ ట్రేడింగ్ డీల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ జట్టుకు మారనుండగా, భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై జట్టులో చేరున్నాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చి 2024 సీజన్లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన పాండ్యా గత మూడు సీజన్లలో రెండుసార్లు జట్టును ప్లేఆఫ్స్ చేర్చలేకపోయాడు.
దాంతో కెప్టెన్సీ భారం లేకుండా కేవలం ఆటగాడిగా స్వేచ్ఛగా ఆడాలని, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఓ ఆల్ రౌండర్‌గా బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నాడని లీగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక జట్టులో ఇండియన్ ఆల్‌రౌండర్ లేని లోటును పాండ్యాతో భర్తీ చేసేందుకు కొన్నేండ్లుగా చాన్నాళ్లుగా తమ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అర్ష్‌దీప్‌ను వదులుకోవాలని పంజాబ్ కఠిన నిర్ణయం తీసుకుంది.కాగా, ఈ ట్రేడింగ్ అధికారికంగా పూర్తయిన తర్వాత మార్కస్ స్టోయినిస్, నేహాల్ వధేరాను కూడా రిలీజ్ చేసే యోచనలో పంజాబ్ ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

