IPL 2025 | ఫ్రాంచైజీలకు డెడ్‌లైన్.. అక్టోబర్ 31లోపు జాబితా ఇస్తేనే?
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రిటెన్షన్ విధానం(Retention Rule)పై ఉత్కంఠ వీడడంతో ఫ్రాంచైజీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఐదుగురికి అనుమతవ్వడంతో.. పది ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితా తయారీకి సిద్ధమవుతున్నాయి. దాంతో.. ఐపీఎల్ యజమానులు నిర్ణీత గడుపు లోపు లిస్ట్ సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు.
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రిటెన్షన్ విధానం(Retention Rule)పై ఉత్కంఠ వీడడంతో ఫ్రాంచైజీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 17వ సీజన్లో నలుగురినే అట్టిపెట్టుకునేందుకు అనుమతిచ్చిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పుడు .. ఈసారి ఐదుగురికి అనుమతిచ్చింది. దాంతో, పది ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితా తయారీకి సిద్ధమవుతున్నాయి. ఎవరిని అట్టిపెట్టుకోవాలి? ఎవరెవరిని వదిలించుకోవాలి? అనే విషయంపై ఇప్పటికే ఓ అంచనాతో ఉన్న యాజమాన్యాలు ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేశాయి.
ఎందుకంటే.. నవంబర్‌లో మెగా వేలం నిర్వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీలకు రిటెన్షన్ లిస్ట్ ఇవ్వడానికి గడువు విధించింది. అక్టోబర్ 31 తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆట్టిపెట్టుకుంటున్న ఆటగాళ్ల జాబితాను తమకు సమర్పించాలని ఫ్రాంచైజీల యజమానులను ఆదేశించింది. దాంతో, నిర్ణీత సమయంలోపు లిస్ట్ పంపేందుకు పది జట్లు సిద్ధమవుతున్నాయి.

బెంగళూరులో శనివారం సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రతి ఫ్రాంచైజీకి ఐదుగురిని అట్టిపెట్టుకునే అవకాశం కల్పించింది. అయితే.. ఈ ఐదుగురిలో భారత ఆటగాళ్లు ఎందరు ఉండాలి? విదేశీ క్రికెటర్ల పరిమితి ఎంత? అనే నిర్ణయాన్ని ఫ్రాంచైజీలకే వదిలేసింది. అయితే రైటు టు మ్యాచ్ విధానాన్ని మాత్రం ఒక్క ఆటగాడికే పరిమితం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈసారి ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను కూడా రూ.120 కోట్లుకు పెంచింది. 17 వ సీజన్‌కు ముందు ఫ్రాంచైజీలు రూ.100 కోట్ల పర్స్‌తో మినీ వేలంలో పాల్గొన్నాయి.
ఇవి కూడా చదవండి
- Pawan Kalyan | ‘హరిహర వీరమల్లు’ కోసం పాట పాడబోతున్న పవన్ కళ్యాణ్.?
- Watch: ఎన్నికల సభలో ప్రసంగిస్తూ సొమ్మసిల్లిన ఖర్గే.. తర్వాత ఏం జరిగిందంటే?
- జగన్ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగింది.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
- Zebra | సత్యదేవ్‌కు సపోర్ట్‌గా నాని.. జీబ్రా టీజర్ టైం చెప్పేశారు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Josh Inglis: ఆసీస్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ అరుదైన రికార్డు
‘కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు’
cow slaughter case | గోవధ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. హిందూ గ్రంథాలను ప్రస్తావించిన గుజరాత్ కోర్టు
‘టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో ఎంపీ వద్దిరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

