Pawan Kalyan | ‘హరిహర వీరమల్లు’ కోసం పాట పాడబోతున్న పవన్ కళ్యాణ్.?
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మళ్లీ మొదలైన విషయం తెలిసిందే.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విజయవాడలో శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే మూవీని 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా వుంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక పాట పాడినట్లు తెలుస్తుంది. రీసెంట్గా ఈ పాటకు సంబంధించిన షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ పాటను దీపావళి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా.. దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ ఖుషి, తమ్ముడు, జానీ, గుడుంబా శంకర్, పంజా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో పాట పాడి అలరించారు. అయితే హరిహర వీరమల్లు సినిమా కోసం కూడా పాట పాడుతుండడంతో ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.
దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

