లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ లైవ్ అప్డేట్స్
IPL 2023 : ఐపీఎల్ డబుల్ హెడర్‌లో ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, కేఎల్ రాహుల్ సేన మొదట బ్యాటింగ్ చేయనుంది.
IPL 2023 : ఐపీఎల్ డబుల్ హెడర్‌లో ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, కేఎల్ రాహుల్ సేన మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్లో రిషభ్ పంత్ గైర్హాజరీలో ఢిల్లీని వార్నర్ నడిపించనున్నాడు.
ఢిల్లీ సబ్స్టిట్యూట్స్ : అమన్ హకీం ఖాన్, మనీష్ పాండే, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, అభిషేక్ పొరెల్
లక్నో సబ్స్టిట్యూట్స్ : ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, డానియెల్ సామ్స్, అమిత్ మిశ్రా.
-
01 Apr 2023 11:32 PM (IST)
లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండ్ షో.. 50 పరుగుల తేడాతో ఢిల్లీ చిత్తు
ఐపీఎల్ పదహారో సీజన్ డబుల్ హెడర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ఓపెనర్ కైలీ మేయర్స్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆ జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశాడు. పేసర్ మార్క్ వుడ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ కీలక వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. మార్క్ వుడ్ ధాటికి ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులకే పరిమితమైంది.
-
01 Apr 2023 11:12 PM (IST)
18 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..?
అవేశ్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో అక్షర్ పటేల్ చెలరేగాడు. సిక్స్, బౌండరీ కొట్టాడు. దాంతో, 14 రన్స్ వచ్చాయి. ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 63 రన్స్ కావాలి.
-
01 Apr 2023 11:03 PM (IST)
వార్నర్ ఔట్.. ఓటమి అంచున ఢిల్లీ
అవేశ్ ఖాన్ ఓవర్లో డేవిడ్ వార్నర్(56) ఔటయ్యాడు. దాంతో, ఆ జట్టు ఆలౌట్ ప్రమాదంలో పడింది. అవేశ్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టాడు.
-
01 Apr 2023 11:01 PM (IST)
ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
ఆరో వికెట్ కోల్పోవడంతో ఢిల్లీ మరింత కష్టాల్లో పడింది. అమన్ హకీం ఖాన్(4)ను అవేశ్ ఖాన్ ఐట్ చేశాడు. డేవిడ్ వార్నర్(56)క్రీజులో ఉన్నాడు. ఢిల్లీ విజయానికి 26 బంతుల్లో 82 రన్స్ కావాలి. సాధించాల్సిన రన్‌రేట్ 18.92పైనే ఉంది.
-
01 Apr 2023 10:55 PM (IST)
వార్నర్ ఫిఫ్టీ
డేవిడ్ వార్నర్(50) హాఫ్ సెంచరీ సాధించాడు. ఉనాద్కాట్ ఓవర్లో రెండు రన్స్ తీసి ఫిఫ్టీకి చేరువయ్యాడు. అమన్ హకీం ఖాన్(2) క్రీజులో ఉన్నాడు. ఢిల్లీ 15 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 110 రన్స్ చేసింది. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 84 రన్స్ కావాలి.
-
01 Apr 2023 10:49 PM (IST)
బిగ్ వికెట్ తీసిన బిష్ణోయ్
ఢిల్లీ క్యాపిటల్స్ మరింత కష్టాల్లో పడింది. రవి బిష్ణోయ్ ఓవర్లో విధ్వంసక బ్యాటర్ రొవ్మన్ పావెల్ (1) ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో, 94 రన్స్‌కే ఢిల్లీ సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ వార్నర్(43), అమన్ హకీం ఖాన్ క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 36 బంతుల్లో 98 రన్స్ కావాలి.
-
01 Apr 2023 10:38 PM (IST)
ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్
ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ పడింది. బిష్ణోయ్ వేసిన 12వ ఓవర్లో రిలీ రస్సో(30) క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఎల్బీ కోసం లక్నో అప్పీల్ చేసింది. కానీ, రిస్సో ఆడిన బంతిని మేయర్స్ అందుకోవడంతో అంపైర్ క్యాచ్ ఔట్ ఇచ్చాడు. దాంతో, 86 రన్స్ వద్ద ఆ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్(35) క్రీజులో ఉన్నాడు.
-
01 Apr 2023 10:17 PM (IST)
మూడో వికెట్ తీసిన వుడ్
మార్క్ వుడ్ మరోసారి చెలరేగాడు. సర్ఫరాజ్ ఖాన్(4)ను ఐట్ చేసి మూడో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఏడో ఓవర్ ఆఖరి బంతికి సర్ఫరాజ్ భారీ షాట్ ఆడాడు. కానీ, బౌండరీ వద్ద గౌతమ్ క్యాచ్ పట్టడంతో అతను ఔటయ్యాడు. డేవిడ్ వార్నర్(30), రిలీ రస్సో క్రీజులో ఉన్నారు.
-
01 Apr 2023 10:08 PM (IST)
పవర్ ప్లేలో ఢిల్లీ స్కోర్..?
పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 47 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్(27), సర్ఫరాజ్ ఖాన్(4) క్రీజులో ఉన్నారు.
-
01 Apr 2023 10:00 PM (IST)
ఒకే ఓవర్లో రెండు వికెట్లు
మార్క్ వుడ్ దెబ్బకు ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ పృథ్వీ షా(12)ను, ఆ తర్వాతి బంతికి మిచెల్ మార్ష్(0)ను వుడ్ బౌల్డ్ చేశాడు. డేవిడ్ వార్నర్(26), సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నారు.
-
01 Apr 2023 09:57 PM (IST)
ఢిల్లీ ఓపెనర్ బౌల్డ్
ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా(12) బౌల్డ్ అయ్యాడు. మార్క్ వుడ్ ఓవర్లో బంతిని సరిగ్గా అంచనా వేయలేక ఔటయ్యాడు.
-
01 Apr 2023 09:48 PM (IST)
మూడు ఓవర్లకు ఢిల్లీ స్కోర్..?
మూడు ఓవర్లకు ఢిల్లీ34 రన్స్ చేసింది. గౌతమ్ వేసిన ఓవర్లో డేవిడ్ వార్నర్(2-) బౌండరీ కొట్టాడు. అంతకుముందు జయదేవ్ ఉనాద్కాట్ వేసిన రెండో ఓవర్లో వార్నర్ రెండు, పృథ్వీ షా(11) ఒక బౌండరీ కొట్టారు. దాంతో, 17 రన్స్ వచ్చాయి.
-
01 Apr 2023 09:38 PM (IST)
తొలి ఓవర్లో 7 రన్స్
మేయర్స్ వేసిన తొలి ఓవర్లో డేవిడ్ వార్నర్(5) ఫోర్ కొట్టాడు. దాంతో, 7 రన్స్ వచ్చాయి. పృథ్వీ షా(1) క్రీజులో ఉన్నాడు.
-
01 Apr 2023 09:18 PM (IST)
ఢీల్లీ టార్గెట్ 194
చేతన్ సకారియా వేసిన ఆఖరి ఓవర్ మూడో బంతికి బదొని 97 మీటర్ల సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతిని కూడా స్టాండ్స్‌కు తరలించాడు. ఐదో బంతికి ఔటయ్యాడు. ఆఖరి బంతిని గౌతమ్ సిక్స్ కొట్టాడు. దాంతో, ఆ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 రన్స్ చేసింది.
-
01 Apr 2023 09:11 PM (IST)
ఖలీల్ అహ్మద్ స్థానంలో అమన్ ఖాన్
ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి ఓవర్లో సబిస్టిట్యూట్ను తీసుకుంది. ఖలీల్ అహ్మద్ కోటా ముగియడంతో అతని ప్లేస్‌లో అమన్ ఖాన్‌ను తీసుకుంది.
-
01 Apr 2023 09:05 PM (IST)
పూరన్ ఔట్
విధ్వంసక బ్యాటర్ నికోలస్ పూరన్(36) ఔటయ్యాడు. ఖలీల్ అహ్మద్ ఓవర్లో మిడాన్‌లో పృథ్వీ షాకు నేరుగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 165 వద్ద లక్నో ఐదో వికెట్ పడింది.
-
01 Apr 2023 08:54 PM (IST)
పూరన్ వీర బాదుడు
నికోలస్ పూరన్(24) దంచి కొడుతున్నాడు. చేతన్ సకారియా ఓవర్లో ఈ హిట్టర్ చెలరేగిపోయాడు. రెండు సిక్స్‌లు, ఒక బౌండరీ బాదాడు. దాంతో, 19 రన్స్ వచ్చాయి. 17 ఓవర్లకు లక్నో 4 వికెట్ల నష్టానికి 150 రన్స్ చేసింది. కృనాల్ పాండ్యా(12) క్రీజులో ఉన్నాడు.
-
01 Apr 2023 08:47 PM (IST)
16 ఓవర్లకు లక్నో స్కోర్..?
16 ఓవర్లకు లక్నో 4 వికెట్ల నష్టానికి 131 రన్స్ చేసింది. నికోలస్ పూరన్(13), కృనాల్ పాండ్యా(5) క్రీజులో ఉన్నారు.
-
01 Apr 2023 08:42 PM (IST)
నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో..
లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14.1 ఓవర్లలో మార్కస్ స్టాయినిస్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
-
01 Apr 2023 08:28 PM (IST)
మూడో వికెట్ కోల్పోయిన లక్నో
లక్నో సూపర్‌జెయింట్స్ 12 ఓవర్లో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. జోరుమీదున్న మయార్స్ను అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలింగ్‌తో పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం 12 ఓవర్లకు 101 పరుగులు చేసింది లక్నో.
-
01 Apr 2023 08:26 PM (IST)
రెండో వికెట్ కోల్పోయిన లక్నో
లక్నో సూపర్‌జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
-
01 Apr 2023 08:22 PM (IST)
10 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్..?
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ కైలీ మేయర్ హడలెత్తిస్తున్నాడు. 64 (32b) .
-
01 Apr 2023 08:16 PM (IST)
మేయర్స్ హాఫ్ సెంచరీ
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ కైలీ మేయర్ (51) హాఫ్ సెంచరీ బాదాడు. కుల్దీప్ యాదవ్ ఓవర్లో సిక్స్ కొట్టి ఫిఫ్టీకి చేరువయ్యాడు. ధాటిగా ఆడిన అతను 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు కొట్టాడు. దాంతో, 9 ఓవర్లకు లక్నో వికెట్ నష్టానికి 73 రన్స్ చేసింది. దీపక్ హుడా (13) క్రీజులో ఉన్నాడు.
-
01 Apr 2023 07:53 PM (IST)
లక్నోకు షాక్.. బిగ్ వికెట్ తీసిన సకారియా
లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ పడింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(8) ఔటయ్యాడు. చేతన్ సకారియా ఓవర్లో సిక్స్ కొట్టిన అతను ఆ తర్వాతి బంతిని గాల్లోకి లేపాడు. బౌండరీ దగ్గర అక్షర్ పటేల్ క్యాచ్ పట్టాడు. దాంతో, 19 రన్స్ వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. కైలీ మేయర్ (11), దీపక్ హుడా క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

