RCB vs KKR | విరాట్ కోహ్లీ దూకుడు.. కోల్‌కతా ముందు భారీ లక్ష్యం!
RCB vs KKR | ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడారు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ ఒంటరిపోరుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ స్కోర్‌ను అందించారు. కోల్‌కతా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.
RCB vs KKR | ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడారు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ ఒంటరిపోరుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ స్కోర్‌ను అందించారు. కోల్‌కతా ముందు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే హర్షిత్ రాణా బౌలింగ్‌లో డుప్లెసిస్ ( 6 బంతుల్లో 8 పరుగులు ) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్ (21 బంతుల్లో 33 పరుగులు) కాసేపు నిలకడగా ఆడాడు. కానీ 9వ ఓవర్లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక మిడిలార్డర్ పూర్తిగా విఫలమయ్యింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (19 బంతుల్లో 28) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రజత్ పాటిదార్ (3), అనుజ్ రావత్ (3) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. చివర్లో దినేశ్ కార్తిక్ (8 బంతుల్లో 20 పరుగులు ) దూకుడుగా మొదలుపెట్టినప్పటికీ.. ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ( 59 బంతుల్లో 83 పరుగులు ) ఒక్కడే మొదట్నుంచి చెలరేగి ఆడాడు. ఫలితంగా ఆరు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 182 పరుగులు చేసింది. కోల్‌కతా ముందు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

