RCB vs KKR | బెంగళూరు నిర్దేశించిన లక్ష్య చేధనలో దూకుడుగా ఇన్నింగ్ ఆరంభించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షాక్ తగిలింది. వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. పవర్ ప్లేలో 85 వికెట్లు చేసిన కోల్‌కతాకు ఏడో ఓవర్లో ఎదురుదెబ్బ తగిలింది. ఏడో ఓవర్లో మయాంక్ వేసిన బంతికి నరైన్ (47) బౌల్డయ్యాడు. ఎనిమిదో ఓవర్లో ఫిలిప్ సాల్ట్ కూడా ఔటయ్యాడు. విజయ్‌కుమార్ వేసిన బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చాడు. 8 ఓవర్లకు కోల్‌కతా రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.