PBKS vs GT | పంజాబ్ ఆలౌట్.. గుజరాత్ ముందు ఈజీ టార్గెట్!
PBKS vs GT | సొంతగడ్డపైనే పంజాబ్‌కు గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. ధీటైన బౌలింగ్‌తో పరుగులు చేయకుండా పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో పంజాబ్ బ్యాటర్లు అందరూ పరుగులు చేయడంలో నెమ్మదించారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35 ) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. హర్‌ప్రీత్ బ్రార్ (29 ), శామ్ కరన్(20), హర్‌ప్రీత్ సింగ్ భాటియా (), జితేశ్ శర్మ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
PBKS vs GT | సొంతగడ్డపైనే పంజాబ్‌కు గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. ధీటైన బౌలింగ్‌తో ఒకవైపు వికెట్లు తీస్తూనే.. మరోవైపు పరుగులు చేయకుండా పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో పంజాబ్ బ్యాటర్లు అందరూ పరుగులు చేయడంలో నెమ్మదించారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35 ) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. హర్‌ప్రీత్ బ్రార్ (29 ), శామ్ కరన్(20), హర్‌ప్రీత్ సింగ్ భాటియా (14), జితేశ్ శర్మ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిగిలిన బ్యాటర్లు అంతా విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 142 పరుగులు చేసిన పంజాబ్ ఆలౌటయ్యింది. గుజరాత్ ముందు 143 పరుగుల ఈజీ టార్గెట్‌ను ఉంచింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కానీ పవర్ ప్లే పూర్తయ్యేలోపే తొలి వికెట్‌ను కోల్పోయింది. అప్పట్నుంచి పంజాబ్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఏడో ఓవర్లో చివరి బంతికి రొస్సోవ్ (9).. ఎనిమిదో ఓవర్లో ఐదో బంతికి కరన్ (20) ఔటయ్యారు. ఈ రెండు వికెట్ల విషయంలో పంజాబ్ రివ్యూకు వెళ్లినప్పటికీ పంజాబ్‌కు వ్యతిరేకంగానే ఫలితం వచ్చింది. వరుసగా రెండు వికెట్లను కోల్పోవడంతో పంజాబ్ పరుగుల వేటలో నెమ్మదించింది. గుజరాత్ బౌలర్లను తట్టుకోలేక నిలకడగా ఆడుతూ వచ్చింది. దీంతో పవర్‌ప్లే పూర్తయ్యే సరికి 56 పరుగులు చేసిన పంజాబ్.. 10 ఓవర్లకు 74 పరుగులు మాత్రమే చేసింది.
ఇక 11వ ఓవర్ నుంచి పంజాబ్ మళ్లీ వరుసగా వికెట్లను కోల్పోయింది. 11వ ఓవర్లో రెండో బంతికి లివింగ్స్టన్ (6) ఔటయ్యాడు. 12వ ఓవర్లో నాలుగో బంతికి జితేశ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 14వ ఓవర్లో ఆశుతోష్ (3) కూడా ఔటయ్యాడు. తొలి బంతికి రివ్యూ వెళ్లడంతో సానుకూల ఫలితం వచ్చింది. కానీ ఐదో బంతికి భారీ సిక్స్ కొట్టేందుకు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. 16వ ఓవర్లో రెండో బంతికి శశాంక్ సింగ్ (8) కూడా ఔటయ్యాడు. 19వ ఓవర్లో చివరి బంతికి భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించిన బ్రార్ (29) షారుక్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక చివరి ఓవర్లో హర్షల్ పటేల్ (0), భాటియా (14) వికెట్‌ను పంజాబ్ కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 142 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

