LSG vs PBKS | బోణీ కొట్టిన లఖ్‌నవూ.. పంజాబ్‌పై ఘన విజయం
LSG vs PBKS | ఐపీఎల్ 17వ సీజన్లో లఖ్‌నవూ బోణీ కొట్టింది. సొంత గడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఓపెనర్ డికాక్ (38 బంతుల్లో 54 పరుగులు) హాఫ్ సెంచరీతో మెరవగా.. నికోలస్ పూరన్ ( 21 బంతుల్లో 42 పరుగులు ), కృనాల్ పాండ్యా (22 బంతుల్లో 43 పరుగులు ) చెలరేగి ఆడి 199 పరుగుల భారీ స్కోర్ సాధించారు.
LSG vs PBKS | ఐపీఎల్ 17వ సీజన్లో లఖ్‌నవూ బోణీ కొట్టింది. సొంత గడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ దంచికొట్టింది. ఓపెనర్ డికాక్ (38 బంతుల్లో 54 పరుగులు) హాఫ్ సెంచరీతో మెరవగా.. నికోలస్ పూరన్ ( 21 బంతుల్లో 42 పరుగులు ), కృనాల్ పాండ్యా (22 బంతుల్లో 43 పరుగులు ) చెలరేగి ఆడి 199 పరుగుల భారీ స్కోర్ సాధించారు. 200 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. శిఖర్ ధవన్ (49 బంతుల్లో 70 పరుగులు )దంచికొట్టాడు. ఇతనికి బెయిర్ స్టో తోడయ్యాడు. కానీ మిగతా ప్లేయర్లు రాణించకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత 20 పరుగులు ముగిసేసరికి 178 పరుగుల వద్దే ఆగిపోయింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఆరంభంలోనే షాక్ తగిలింది. పవర్ ప్లే ముగిసేలోపే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. నాలుగో ఓవర్లో కేఎల్ రాహుల్ ( 9 బంతుల్లో 15 పరుగులు), ఆరో ఓవర్లో దేవ్‌దత్ పడిక్కల్ ( 6 బంతుల్లో 9 పరుగులు ) ఔటయ్యారు. వాళ్ల తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టాయినిస్ (12 బంతుల్లో 19 పరుగులు ) కూడా రాణించలేకపోయాడు. తొమ్మిదో ఓవర్లో చాహర్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
స్టాయినిస్ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ ( 21 బంతుల్లో 42 పరుగులు).. ఓపెనర్ డికాక్(38 బంతుల్లో 54 పరుగులు)కు మంచి పార్టనర్షిప్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి జట్టుకు కీలక స్కోర్ అందించారు. అయితే 13వ ఓవర్లో డికాక్ ఔటయిన తర్వాత పూరన్ జోరుకు బ్రేక్ పడింది. ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. డికాక్, పూరన్ పరుగుల వేటను కృనాల్ పాండ్యా ( 22 బంతుల్లో 43 పరుగులు) కొనసాగించాడు. కానీ అప్పటికే పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 19 ఓవర్లో లఖ్‌నవూ వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
టార్గెట్ చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఓపెనర్లు శిఖర్ ధవన్(49 బంతుల్లో 70 పరుగులు ), బెయిర్ స్టో (29 బంతుల్లో 42 పరుగులు ) చెలరేగారు. వీళ్ల దూకుడు చూస్తే ఇద్దరే టార్గెట్‌ను చేధిస్తారేమో అని అనిపించింది.. కానీ బెయిర్ స్టో ఔటవ్వడంతో పంజాబ్ జోరుకు బ్రేక్ పడింది. బెయిర్ స్టో తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రభ్‌మన్ సింగ్ ( 7 బంతుల్లో 19 పరుగులు ), జితేశ్ శర్మ ( 9 బంతుల్లో 6 పరుగులు ) ప్రభావం చూపించలేకపోయారు. ఇక 17వ ఓవర్లో శిఖర్ ధవన్ ఔటవ్వడం.. ఆ తర్వాత బంతికే సామ్ కరన్ (0) డకౌట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా లఖ్‌నవూ చేతిలోకి వెళ్లిపోయింది. వాళ్ల తర్వాత క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ (17 బంతుల్లో 28 పరుగులు), శశాంక్ సింగ్ ( 7 బంతుల్లో 9 పరుగులు) కష్టపడినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 178 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో 21 పరుగుల తేడాతో లఖ్‌నవూ విజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

