KKR vs RCB | విజృంభించిన కోల్‌కతా.. బెంగళూరు ముందు భారీ టార్గెట్!
KKR vs RCB | ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఫిలిప్ సాల్ట్ వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విజృంభించాడు. వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నప్పటికీ జట్టుకు మంచి స్కోర్ అందించాడు. సాల్ట్ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీతో దూకుడు ప్రదర్శించాడు.
KKR vs RCB | ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఫిలిప్ సాల్ట్ వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విజృంభించాడు. వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నప్పటికీ జట్టుకు మంచి స్కోర్ అందించాడు. సాల్ట్ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీతో దూకుడు ప్రదర్శించాడు. వీరికి మిగతా ప్లేయర్లు కూడా తోడవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేశారు. బెంగళూరుకు 223 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన కోల్‌కతా బ్యాటర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ చెలరేగి ఆడాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో బీభత్సం సృష్టించాడు. కేవలం 14 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 4.2 ఓవర్ వద్ద సిరాజ్ వేసిన బంతికి భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. దీంతో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించే అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ 10 పరుగులకే ఔటయ్యాడు.
సాల్ట్, నరైన్ తర్వాత క్రీజులోకి వచ్చిన రఘువంశీ(3), వెంకటేశ్ అయ్యర్ (16) ప్రభావం చూపించలేకపోయారు. కానీ శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్ దూకుడుగా ఆడుతూ జట్టుకు కీలక స్కోర్ అందించారు. కానీ 13.1 ఓవర్లో రింకూ సింగ్ (24) కూడా ఔటయ్యాడు అయినప్పటికీ శ్రేయాస్ అయ్యర్ నిలకడగా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే పెవిలియన్‌కు చేరాడు. చివరలో ఆండ్రీ రస్సెల్ (), రమణ్‌దీప్ సింగ్ () రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ 222 పరుగులను సాధించింది. బెంగళూరుకు 223 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

