GT vs DC | కష్టాల్లో గుజరాత్.. ఐదు ఓవర్లకే నాలుగు వికెట్లు డౌన్
GT vs DC | దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్‌కు వరుసగా షాకుల మీద షాకులు తగిలాయి. ఐదో ఓవర్లోపే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. నాలుగో ఓవర్ ఐదో బంతికి వృద్ధిమాన్ సాహా.. ఔటవ్వగా.. ఐదో ఓవర్లో మొదటి బంతికి సాయి సుదర్శన్ ఔటయ్యాడు.
GT vs DC | గుజరాత్ టైటాన్స్‌కు ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుసగా వికెట్లు తీస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఐదు ఓవర్లు ముగిసేలోపే నాలుగు వికెట్లను తీసి కష్టాల్లోకి నెట్టేశారు. నాలుగో ఓవర్ ఐదో బంతికి వృద్ధిమాన్ సాహా(2).. ఔటవ్వగా.. ఐదో ఓవర్లో మొదటి బంతికి సాయి సుదర్శన్ (12)ఔటయ్యాడు. ఇక ఐదో ఓవర్ చివరి బంతికి డేవిడ్ మిల్లర్ కూడా పెవిలియన్ చేరాడు.
అంతకుముందు రెండో ఓవర్లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి.. శుభ్‌మన్ గిల్ (8) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్ ఉన్నారు. ఐదో ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోర్ 30/4.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

